ఎంత దుర్మార్గులు మన వెదవలు? ఒక ఆడది కనిపిస్తే చాలు చిత్తకార్తె కుక్కలౌతున్నారు!

సమాజం మొత్తం బ్రష్టు బట్టిపోతుంది. నెలల వయసున్న పసిపాప నుండి పండు ముసలివాళ్ళ వరకు ఏ స్త్రీని కనీసం ఒక స్త్రీగా రూపాంతరం చెందకుండ  పసిపాపలుగా ఉన్నవాళ్ళ పై అత్యాచారం ఆపై హత్యాచారం చేసేస్తున్నారు. దీనిపై పోలీసులు కూడా కేసులు రిజిష్టర్ కూడా చేయట్లేదని చాలా పిర్యాదులు వస్తున్నాయి. పోలీసులు కేసు రిజిష్టర్ చేసుకోవటానికి ఒక అసహాయురాలు ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే తప్ప అది సాధ్యం కాలేదు. ఇక నేఱగాళ్ళు చెలరేగిపోరా? 

ఇది అధికారుల వైఫల్యంకాదా? పదే పదే కేసులు ఇలాగే తగలడుతుంటే ఇక వ్యవస్థలెందుకు? ప్రభుత్వాలెందుకు? న్యాయ వ్యవస్థ లెందుకు? చట్ట సభలెందుకు? ఈ చట్టుబండ లెందుకు?  ఒక భర్త లేని అమాయకురాలిని అసహాయురాలిని, తన బావ పెట్టే లైంగిక వేధింపులు భరించలేక, ఒక మహిళ ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ రోజు (శనివారం-ఏప్రిల్ 21) మధ్యాహ్నం ఈ సంఘటన చోటు చేసుకుంది. 

నిజామాబాద్‌ కు చెందిన ఒక మహిళ కొన్నాళ్ళ క్రితం తన భర్తను కోల్పోయింది. తన పాపతో కలిసి సంవత్సరాలుగా ఆ అసహాయ ఒంటరిగా జీవిస్తోంది. వరసకు బావ అయిన నర్రా సాయిలు అనే వ్యక్తి ఆమె అసహాయతను, ఒంటరితనాన్ని ఆసరా చేసుకొని - ఆమెను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నట్లు బాధితురాలు ఆరోపిస్తోంది. అదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసినా, పోలీసులు ఎలాంటి చర్యా తీసుకోకపోవడంతో ఆ మృగాడు మరింత రెచ్చిపోతుండగా భరించలేని ఆమె ఆత్మహత్యకు ప్రయ త్నించినట్లు ఆమె చెప్పింది.

సహనం నశించిన బాధితురాలు తన పసిబిడ్దతో పాటు ప్రభుత్వఆస్పత్రి లోని ఏడో అంతస్తు పైకి వెళ్ళి, తన బావపై వెంటనే చర్య తీసుకోవాలని, లేకుంటే అక్కడి నుంచి దూకేస్తానని బెదిరించింది. పోలీసులు ఎలాగోలా ఆమెకు నచ్చజెప్పి కిందకు తీసుకురావడం జరిగింది. అప్పుడు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తన బావ తనతో అభ్యంతరకరంగా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని పోయిన జూన్‌ నెలలోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపింది. పోలీసులు కేసునమోదు చేయక పోవడం, లేదా ఎలాంటి చర్య తీసుకోకపోవటంతో తీవ్ర మనోవేదనకు గురైనట్లు ఆమె వాపోయింది. చివరకు తన అసహాయతకు తానే జాలి పడుతూ జీవితంపై విరక్తి కలిగి తన బిడ్డతో పాటు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు తెలిపింది. 

ఇప్పుడు అధికారులను ప్రభుత్వం ఎలా కార్యోన్ముఖులను చేస్తుంది? ప్రపంచంలోనే తెలంగాణా టిఆరెస్ ప్రభుత్వం ఉత్తమ ప్రజా పాలన అందిస్తుందని చెప్పే కేసిఆర్ నాయకత్వంలో ఇకనైనా చలనం వస్తుందా?   
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: