ఏపి సిఎంకు గవర్నర్ హితబోద? ఆలోచనల్లో మార్పులేదు! పూర్తిగా బెడిసినట్లే?

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీరు ప్రజలకు గర్హనీయంగాఉంది. ఒక ముఖ్యమంత్రిగా తాను చేయవలసిన పను లు ప్రక్కన బెట్టి, ప్రజలకు యిచ్చిన 600పైగా వాగ్ధానాలను నెరవేర్చకుండా ప్రతిరోజూ ఏదో సందర్భం క్రియేట్ చేసుకొని అటు కేంద్రాన్ని ఇటు వైసిపిని ధారుణంగా విమర్శిస్తూ కాలం గడిపేస్తున్నారు.  తనే తన  స్వహస్తాలతో పదేళ్ల పాటు రాజధానిగా హైదరాబాద్ నగరాన్ని ఉపయోగించుకునే  అవకాశం అలక్ష్యం చేసి - కాలక్రమంలో అమరావతిని విశ్వనగరంగా నిర్మించు కొనే అవకాశాన్ని ఆదిలోనే చంపేసి, పదేళ్ళ సమయంలో నేరవేర్చాలసిన విభజన ప్రయోజనాలను వెంటనే యివ్వాలని కేంద్రంపై బహు విధాలుగా వత్తిడితేవటం సహించరానిదిగా ఉందంటున్నారు. 

కేంద్రం నిర్మించాల్సిన పోలవరం జాతీయప్రోజెక్ట్ లో తాను వేలు పెట్టి నిధుల దుర్వినియోగం చేశారనే అభియోగానికి ఇంత వరకు సరైన సమాధానం యివ్వకుండా విచ్చల విడిగా మాట్లాడటం సహించరానిదిగా ఉందని, అదే తాను ఏపి ప్రజలకిచ్చిన 600వాగ్ధానాలు నేఱవేర్చమని వత్తిడి చేసిన వైసిపిని అభివృద్ధి నిరోదకులని పదే పదే ప్రచారం చేయటం చూస్తే ఆయన ద్వంద్వ ప్రవృత్తే రాష్ట్రానికి కీడు చేస్తుందనిపిస్తుందని పలువురు ప్రముఖులు విశ్లేషిస్తున్నారు. 



రాష్ట్ర గవర్నరుతో మాటామంతి సందర్భంగా ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు హెచ్చరికలతో కూడిన సలహా యిచ్చి నట్లు ప్రముఖ తెలుగు దిన పత్రిక 'ఈనాడు ఆన్లైన్'లో ప్రచురితమైంది. నగరంలోని 'గేట్‌ వే హోటల్‌'లో బసచేసిన గవర్నరు గారిని, ఈ రోజు ఉదయం పదకొండు గంటల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. సుమారు గంట నలభై నిమిషాల పాటు ఇరువురు ఏకాంతంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం.


*ప్రధాని నరేంద్ర మోదీ పై తెలుగుదేశం పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు వ్యక్తిగతంగా దూషణలకు దిగుతుండడం సరికాదని గవర్నర్‌ వారించినట్లు తెలిసింది. 

*కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందడం లేదని, రాష్ట్ర విభజన అనంతరం ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని,  

*నిధుల్లోనూ భారీగా కోత విధిస్తున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తరుణంలో కేంద్ర ఇంటలిజెన్స్‌ చీఫ్‌ కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. *ఇంటలిజెన్స్‌ ఇచ్చిన నివేదికలోని అంశాలను కేంద్రప్రభుత్వం, గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లి వాటిపై ముఖ్యమంత్రితో చర్చించాలని సూచించి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. 

చర్చించబడ్ద అభ్యంతరకర అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నట్లు సమాచారం:

*రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై జరుగుతున్న ఆందోళనలు, స్వయంగా ముఖ్యమంత్రే ధర్మపోరాట దీక్ష పేరిట ఒక రోజంతా నిరసన తెలియజేయడం, 

*ఎన్నికల ప్రచారం రఒజు భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్ధిగా తిరుపతి ప్రచారానికి వచ్చిన నరేంద్రమోదీ వెంకటేశ్వరస్వామి పాదాల చెంత ఇచ్చిన హామీలు నెరవేరలేదంటూ అప్పటి దృశ్యాలను ప్రదర్శించి ఈనెల 30న బహిరంగ సభ నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. 

*ఈ బహిరంగ సభ గురించి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు సమాచారం.

*కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తామని ప్రకటించిన వాటిలో ప్రధానన్మైనవిగా 18అంశాలను పేర్కొంటూ వాటి సాధన కోసం తాము పోరాటం కొనసాగిస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేస్తున్నందున ఆ హామీల పరిస్థితులను గవర్నర్‌ దృష్టికి చంద్రబాబు తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి చేయాలని కోరినట్లు తెలుస్తోంది. 

*దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని పేర్కొంటూ ఇటీవల కేరళలో ఆర్ధిక మంత్రుల సమావేశం జరిగింది. అలాంటి సమావేశం మరింత విస్తృత ప్రాతిపదికగా అమరావతిలో నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు కేంద్ర ఇంటలిజెన్స్‌ పేర్కొంది. 

*ఉత్తరాది- దక్షిణాది రాష్ట్రాలు అనే వ్యత్యాసాలు, ఆందోళనలు, దేశ అంతర్గత భద్రతకు సరికాదని, అదీ దేశం లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరించేవారికి అదంత మంచిది కాదని అన్నట్లు తెలుస్తుంది. 

*రాష్ట్ర సమస్యలపై పోరును దేశ విభజన దిశగా మాట్లాడటం దేశానికి ద్రోహం చేసే విధంగా ఉండరాదని, ఉన్న ఇబ్బందులను సామరస్యంగా పరిష్కరించుకుంటే మేలని గవర్నర్‌ హితవు పలికినట్లు తెలుస్తోంది.

పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం, అమరావతి రాజధాని పనులకు సంబంధించి టెండర్లు, నిధుల వినియోగ పత్రాలపై భారతీయ జనతా పార్టీ నేతలు తమ సందేహాలు, అనుమానాలను ఇప్పటికే ఆ పార్టీ జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లారు. నిధుల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందంటూ విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక బృందం కూడా రాష్ట్రంలో పర్యటించి పరిస్థితులను పరిశీలించి వెళ్లింది. ఆ బృందం నివేదికలోని అంశాలను గవర్నర్‌కు కేంద్ర ప్రభుత్వం పంపి ఉంటుందని భావిస్తున్నారు. 

ప్రధాని నరెంద్ర మోడీపై విజయవాడలో జరిగిన ధర్మపోరాటదీక్ష సమయంలో సినీనటుడు, హిందుపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ భాజపా ప్రజా ప్రతినిధులు గవర్నర్‌కు వినతిపత్రం అందించారు. నందమూరి బాలకృష్ణపై చర్యలు తీసుకోవాలని కూడా వారు కోరారు. ఈ విషయాలన్నింటి పైనా ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం. 

కర్నాటక ఎన్నికల అనంతరం ఆంధ్ర ప్రదెశ్ పై కేంద్రం ప్రత్యేక దృష్టి పెడుతుందనే ప్రచారాంశాలు ఈ భేటీ లో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. మొత్తంగా గంట నలభై  నిమిషాలు సమావేశం జరిగినా - దాని అజెండా, చర్చించిన అంశాలను బయటకు వెల్లడించేందుకు ప్రభుత్వ వర్గాలు విముఖత చూపాయి. సమావేశ వివరాలపై మీడియా ముఖ్యమంత్రిని ప్రశ్నించినప్పటికీ వివరాలు తెలిపేందుకు ఆయన నిరాకరించి వెళ్లిపోయారు.

దీన్ని బట్టి చూస్తే నలభైయేళ్ళ సుధీర్ఘ అనుభవంతో పండిపోయిన  ముఖ్యమంత్రి "కుడితి లో పడ్డ బల్లి లాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారనే  అభిప్రాయం" అభిఙ్జవర్గాల కథనంగా వినిపిస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: