ప్రత్యేకం: రాజ్యాంగ వ్యవస్థలు ఒక కుల వర్గానికే దాస్యం చేసే దరిద్రం తెలుగుజాతికి ఎందుకు?

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు కులాల గుఱించి బాహాటంగానే మాట్లాడుతున్నారు. రాజ్యాంగ మూలస్థంబాలైన శాసనవిభాగం (legislature) , అధికారవిభాగం (executive), న్యాయవిభాగం (judiciary) చివరకు నాలుగోస్థంభం అని మనం అంగీకరించి సూత్రీకరించిన ప్రజా సమాచార విభాగం  మీడియా (media) కూడా కులకంపులో కొట్టుకు పోతున్నాయి. 

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కులపిచ్చి మామూలుగా లేదని అది అందరికి అందనంత తారాస్థాయికి చేరిందని ప్రత్యేకించి న్యాయమూర్తుల ఎంపికలో తమ కులం వారికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్న దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఒక న్యాయమూర్తే స్వయంగా తెలిపారు. ఇలాంటి విషయాలు తెలుగు సుప్రసిద్ధ ఆధిఖ్య మీడియా ఎప్పుడూ వెలువరించదు. తమ పత్రికల్లో ప్రచురించరు లెదా చానళ్ళలో ప్రసారం చేయరు. ఎందుకంటే 85% మీడియా హౌజెస్ ముఖ్యమంత్రి కుల వర్గం వారివే అంతేకాదు అందరూ సన్నిహితులే. ఒక సమర్ధత గల కొమ్మినేని శ్రీనివాసరావు అనే పాత్రికేయుణ్ణి తమ వర్గానికి మద్దతు నివ్వని కారణంగా నిర్దాక్షిణ్యంగా ఒక ప్రఖ్యాత చానల్ నుండి తొలగించేవరకు అధికారంలో ఉన్న పార్టీ అధినేత నిద్రపోలేదట.  

ఇతర కులస్తుల అవకాశాలను దెబ్బతీసేలా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడని, ఏపీ సీఎం హోదాలో ఆయన ఈ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని రిటైర్డ్ న్యాయ మూర్తి జస్టిస్ ఈశ్వర్యయ్య ఆరోపించడం సంచలనాత్మకం.

హైకోర్టు జడ్జిల ఎంపికలో నారా చంద్ర బాబు పక్షపాత వైఖరి బళ్ళున బయటపడిందని, హైకోర్టు జడ్జిల పోటీల్లో నిలిచిన ఇతర కులస్తులైన న్యాయమూర్తులపై అకారణ మైన ఆరోపణలు చేస్తూ, వారు ఆపదవులకు తగినవారు కాదని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలను కూడా ఈ న్యాయమూర్తి ఇతర ఆధారలో సహా బయట పెట్టారు. కేవలం తన కులస్తులు మాత్రమే హైకోర్టు జడ్జిలుగా ఉండాలనేది చంద్రబాబు ప్రణాళిక ఆయన ప్రఘాఢ వాంచ అని ఈ మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య ఆరోపించాడు.

బాబు తప్పుడు లేఖలు రాశాడని కూడా ఆ తర్వాత "ఇంటెలిజెన్స్ బ్యూరో" (ఐబీ) ధ్రువీకరించిందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే న్యాయవ్యవస్థను మేనేజ్ చేస్తాడు అని చంద్రబాబుపై ప్రతిపక్షపార్టీ తరచూ ఆరోపణలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ రిటైర్డ్ జడ్జి ఆరోపణలు మరింత తీవ్రమైనదిగా, చంద్రబాబుపై ఉన్న ఆరోపణల వాడి పెంచేవిలా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.

అంతే కాదు ఒక న్యాయ మూర్తిపై చర్య తీసుకోవాలని రిటైరైన మరో న్యాయ మూర్తి కోరడం విశేషమే కాదు మన సమాజం మేడిపండు లాంటిదని "మేడిపండు పొట్టవిప్పి చూస్తే పురుగులు కనిపిస్తాయని"  అనే సామెత నిజమేనని మరోసారి ఋజువైంది.  "బిసి కమిషన్ మాజీ ఛైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య" నాలుగు దశాబ్ధాల సుధీర్ఘ రాజకీయ అనుభవమున్న, దేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయవేత్తైన ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. 

"బిసి లాయర్లు న్యాయ మూర్తులు" కాకుండా కేంద్రానికి నారా చంద్రబాబు నాయుడు తప్పు డు నివేదికలు పంపించారన్న జస్టిస్ ఈశ్వరయ్య స్వర్ణాంధ్రప్రదేశ్‌ అనేది నారా చంద్ర బాబు నాయుడు కులానికేనా లేదా ఆయన జాతికేనా? అని ప్రశ్నించారు. బాబుకు వత్తాసు పలికిన సుప్రీంకోర్టు న్యాయమూర్తిపై కూడా విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేయడం గమనించతగిన విశేషం. 

ఇప్పుడు ఆంధ్ర పదేశ్ లో చంద్ర బాబు కులానికి చెందిన వారికి తప్ప వేరే ఇతర కుల వర్గాలకు ఎలాంటి ప్రాజెక్టుల కాంట్రాక్టులుగాని, గుత్త పనులు గానీ దక్కడం లేద న్నారు. రాష్ట్రంలో బీసీ మంత్రులు ఉన్నప్పటికీ వారికి ఎలాంటి అధికారాలు లేకుండా చేశారన్నారు. రాష్ట్రంలో ప్రజారక్షకుడిగా ఉన్న వ్యక్తే ప్రజాభక్షకుడిగా మారారని ఆయన దుయ్యబట్టారు.

తమ కులం వారు రాజకీయంగా ఆర్ధికంగా అధికారపరంగా సంఖ్యాపరంగా అత్యంత బలంగా ఉన్న అమరావతి ప్రాంతాన్ని నారా చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా రాజధాని ప్రాంతంగా ఎంపిక చేశారనే ఆరోపణ జనంలో ఘనంగా ఉంది. ఆఖరికి నారా చంద్రబాబు నాయుడుకు మద్దతుగా నిలిచిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కూడా ఇదేమాటే అన్నాడు. ఇటీవలే ఐవైఆర్ "ఎవరి రాజధాని అమరావతి?"  అంటూ తన పుస్తకంలో ప్రశ్నించాడు. అంతేకాదు అమరావతి రాజధానిగా పనికి రాదని మరో విశ్రాంత చీఫ్ సెక్రటరి అజేయ కల్లం కూడా చెప్పారు. రాజధాని విషయంలో అమరావతి ఏమాత్రం ప్రయోజనకరమైనది దీనిపై కేంద్రం నియమించిన "రాధాకృష్ణ కమీషన్" నిర్ద్వందంగా తిరస్కరించింది. మరైతే  ఇంత బాబుగారి కులపిచ్చి మహాభారతాన్ని వివరించటానికి "రాజధాని అమరావతి ఎవరికోసం" అనే పేరుతో ఒక "ట్రియటైజ్" రాసేయాలి.   

మీరు పరిశీలిస్తే సుప్రీం కోర్ట్ అంటే దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఉన్న తెలుగు న్యాయమూర్తులు (ఉభయ రాష్ట్రాలకు చెందిన వారు) మొత్తం ముగ్గురే. అందరూ  వారే. అంతకంటే ప్రమాదకరమైన విషయం "ఆ ముగ్గురూ చంద్రబాబు కుల వర్గానికి చెందిన అమరావాతికి ఇరుగు పొరుగు ప్రాంతాల వాసులు"   *జస్టిస్ జాస్తి చలమేశ్వర్ * ఎన్వి రమణ *లావు నాగేశ్వరరావు *

చాలా మంది అనే విషయమేమంటే సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తిపై విమర్శలు చేసి, అభిశంసన నోటీస్ ఇవ్వటంలో ప్రధాన పాత్రధారి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ వెనుక రాజకీయంగా 'ఒక తెలుగు అధికార పార్టి ప్రముఖుడు' దన్ను, అండదండలు ఉన్నాయంటారు. అంతేకాదు చంద్రబాబు పై 18 పైగా కేసుల విహారణపై "స్టేలు" (సంవత్సరాలుగా విచారణలు నిలిపివేత) లభించటానికి గల నేపధ్యం సరిగా ఆలోచిస్తే అతి సునాయాసంగా అర్ధమైపోతుంది, "న్యాయవ్యవస్థ వెల్-మానేజ్డ్"  అని.


కులపిచ్చి చట్రంలో న్యాయవ్యవస్థ అవస్థ: జస్టిస్ వి. ఈశ్వరయ్య 


తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుకు తీవ్రమైన కులపిచ్చి ఉందని ఆరోపించారు రిటైర్డ్ జడ్జి ఈశ్వరయ్య. బాబుకు కులపిచ్చి అని, ఈ పిచ్చితో ఆయన కీలకమైన న్యాయవ్యవస్థను భ్రష్టు పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని ఆ రిటైర్డ్ న్యాయమూర్తి అంటున్నారు. బాబు కులపిచ్చితో చేసిన కొన్ని పనులను కూడా ఈయన సాక్ష్యాధారాలతో బయటపెట్టారు. 


హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో చంద్రబాబు నాయుడు కులపిచ్చితో వ్యవహరించాడు అని ఈ రిటైర్డ్ జడ్జి అంటున్నారు. ఇందుకు సంబంధించి సాక్ష్యాధారాలను కూడా ప్రస్తావించారు ఆయన. హై కోర్టు జడ్జిల నియామకం విషయంలో ఇతర కులస్తులు అయిన న్యాయమూర్తులకు వ్యతిరేకంగా చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో కేంద్ర న్యాయశాఖకు నివేదిక ఇచ్చాడని, తప్పుడు ఆరోపణలతో లేఖ రాశాడు అని ఈ రిటైర్డ్ జడ్జి ఆరోపించాడు. 


కేవలం కమ్మ సామాజికవర్గానికి చెందిన న్యాయమూర్తులను పక్కన పెట్టి, మిగతా వాళ్లెవరినీ హైకోర్టు జడ్జిలుగా నియమించకూడదని బాబు కుట్ర చేశాడని, అలాంటి ఉద్దేశంతో లేఖలు రాశాడని ఆయన అన్నారు. బాబు కులపిచ్చికి ఇది నిదర్శనమని ఆయన వ్యాక్యానించారు.


కీలకమైన హైకోర్టు న్యాయమూర్తుల నియామకం విషయంలో చంద్రబాబు ఇలా వ్యవహరించడంపట్ల ఆయన ధ్వజమెత్తారు. బాబు తీరుపై విరుచుకుపడ్డారు. ఇప్పటికే  తెలుగుదేశం హయాంలో ప్రబలిన కులపిచ్చి ఆరోపణలకు ఈ రిటైర్డ్ జడ్జి ఆరోపణలు మరింత ఊతం ఇస్తున్నట్టుగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: