షాకింగ్ జనసేన లో ఉపాసన ?

Seetha Sailaja
పవన్ కళ్యాణ్ ట్విటర్ వేదికగా కొన్ని ప్రముఖ మీడియా సంస్థలను టార్గెట్ చేస్తూ కొనసాగిస్తున్న ట్విటర్ పోరాటం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించడం లేదు. తన పై ఆరు నెలలపాటు బహిరంగ దూషణలు చేసి మానసిక అత్యాచారాలు చేసిన కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు తనకు చాటుమాటుగా క్షమార్పణలు చెపుతామని రహస్యంగా లీకులు ఇస్తున్నారని ఇలా ప్రవర్తించే బదులు తనకు బహిరంగంగా క్షమార్పణలు చెప్పవచ్చు కదా అంటూ పవన్ తన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. 

ఇలాంటి పరిస్థుతులలో ‘జనసేన’ వ్యవహారాలను పవన్ కుడిభుజం లా ఉండి చూసుకోవడానికి ఉపాసనను ప్రత్యక్ష రాజకీయాలలోకి దింపి రానున్న ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లోని ఒక కీలక నియోజక వర్గం నుండి ఉపాసనను ఎన్నికల బరిలోకి దింపితే ఎలా ఉంటుంది అన్న విషయమై ప్రస్తుతం మెగా కాంపౌండ్ లో చర్చలు కూడ జరుగుతున్నట్లు వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఇప్పటికే ఉపాసన అపోలో సంస్థలకు డైరెక్టర్ గా ఉంటూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న నేపధ్యంలో ఉపాసన రాక వల్ల పవన్ ‘జనసేన’ కు మరింత ఆకర్షణ తోడవుతుందని మెగా కాంపౌండ్ నమ్మకంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 

దీనికితోడు కొన్ని రోజుల క్రితం విశాఖపట్టణం వచ్చిన లక్ష్మీనారాయణ మీడియా వర్గాలతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ వస్తేకానీ అభివృద్ధి జరగదు అని ఖచ్చితమైన తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దీనితో లక్ష్మీనారాయణ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న తెలుగుదేశం జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలలో ఏ పార్టీలోకి చేరబోతున్నారు అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. జగన్ కేసుల వ్యవహారాలను బయటపెట్టింది లక్ష్మీనారాయణ కాబట్టి జగన్ పార్టీ వైపు లక్ష్మీనారాయణ వెళ్ళే అవకాశాలు లేవు. దీనితో ఆయన రాజకీయ ఎంట్రీకి దారిని ఏర్పరచగల పార్టీలు కేవలం తెలుగుదేశం జనసెనలు మాత్రమే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం రాజకీయ వర్గాలలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం లక్ష్మీనారాయణను ‘జనసేన’ బాట  పట్టించి పవన్ కు మరింత బలం చేకూర్చాలని జాతీయ స్థాయిలో ఒక అత్యంత ప్రముఖ వ్యక్తి ఈవిషయమై రాయబారాలు చేస్తున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో పవన్ కు తోడుగా మెగా కుటుంబ ప్రతినిధిగా ఉపాసన కూడ తోడైతే ఈమధ్య కాలంలో పవన్ కు తగ్గిన క్రేజ్ మళ్ళీ విపరీతంగా పుంజుకునే ఆస్కారం ఉంది అని రాజకీయ విశ్లేషకులు విశ్లేషణలు చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: