టాలీవుడ్ మూలవిరాట్లను వీధుల్లోకి లాగేసిన ఘటన చారిత్రాత్మకం & చిరస్మరణీయం

ప్రళయం ముంచుకొచ్చి ప్రమాదం దాపుల్లోకి చేరినప్పుడు 'పాము-ముంగిస'  కూడా కలసి ముందుకు సాగటం మనం చూస్తూనే ఉన్నాం కనీసం వినైనా ఉంటాం. అందరికి ఏదోలా కాలం మూడినప్పుడు ప్రాణాలు కాపాడుకోవటం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఇప్పుడు అదే జరుగుతుంది తెలుగు చిత్రసీమ టాలీవుడ్ లో. అడ్రస్ లేని ఒక అసహాయ మహిళ నటి శ్రీరెడ్డి చేసిన పని తప్పో ఒప్పో అది మాత్రం సంచలనమే ఆందోళనే. మూల విరాట్లనే వీధుల్లొకి ఈడ్చి పారేసింది. 

ఈ మహానటులు, చొత్ర రంగ ప్రముఖుల ఈ సమావేశం - ఆ వ్యక్తులు వారి స్కిన్ ను కాపాడుకోవలసిన అవసరం రావటంతోనే జరిగింది. తెలుగు సినిమారంగం నలుగురు కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతుందనే దాసరి మాటల్లో ఉన్న ఆ నలుగురికి లేదా ఆ నలుగురిలో ఏ ఒక్కడికో దెబ్బ తగిలితేనే 'మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్-(మా)"  కు చలనం వచ్చింది. 'ఫిలిం చాంబర్'  కు చెమటలు పట్తాయి. అందుకే ఈ సమావేశం అంటున్నారు జగమెరిగిన సినీ పండితులు. 
    
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొన్నిరోజులుగా జరుగుతున్న వివాదాల గురించి చర్చించు కోవడానికి పలువురు సినీప్రముఖులు మంగళవారం రాత్రి 7గంటలకు సమా వేశం అయ్యారు. హైదరాబాద్‌ లోని అన్నపూర్ణ స్టూడియో ఈ సమావేశానికి వేదిక అయింది. నటుడు చిరంజీవి ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. 

‘క్యాస్టింగ్‌ కౌచ్‌’ గురించి నటి శ్రీరెడ్డి చేసిన ఆరోపణల నుంచి ఇటీవలి కాలంలో ఇండస్ట్రీ చుట్టూ అల్లుకున్న వివాదాల వరకూ ఈ సమావేశంలో చర్చించుకున్నారని తెలి సింది. అయితే ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 25 మంది ప్రముఖులు సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మెగాసమావేశంలో వెంకటేష్, మహేష్ బాబు, జూనియర్‌ ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లు అర్జున్, కల్యాణరామ్, సుమంత్, రామ్, నాని, నాగచైతన్య, వరుణతేజ్, అఖిల్, రాజ్‌ తరుణ్‌ వంటి నటు లతో పాటు నిర్మాతలు అల్లు అరవింద్, పి. కిరణ్, ఎన్వీ ప్రసాద్, కేఎల్‌ నారాయణ, నిర్మాతలు బహుముఖ ప్రఙ్జావంతులు తమ్మారెడ్డి భరద్వాజ, మంచు లక్ష్మీ, జీవిత తదితరులు పాల్గొన్నారని సమాచారం.ఈవుడ్ 

నటుడు నందమూరి బాలకృష్ణ హాజరు కాకపోవడం ప్రధానంగా చర్చనీయాంశమైంది. ఇది చిత్రసీమలొని లుకలుకలు రాజకీయాలను ప్రస్పుటం చేస్తుంది. సమావేశం దాదాపు రెండుగంటలు జరిగినట్లు తెలిసింది. "క్యాస్టింగ్‌ కౌచ్‌" గురించి, కొన్ని ఎలక్ట్రానిక్‌ చానల్స్‌ పై "బ్యాన్‌" గురించి చర్చించుకున్నారని భోగట్టా. చానల్స్‌ పై నిషేధాన్ని కొందరు వ్యతిరేకించారట. మంగళవారం జరిగిన సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోన లేదని, మరో సమావేశం ఏర్పాటు చేయాలని అనుకున్నారని తెలిసింది. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మీడియాతో పంచుకునే అవకాశం ఉందని కూడా తెలిసింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: