జగన్.. ఈ తప్పు చేస్తే 2019లోనూ పరాజయమే..!?

Chakravarthi Kalyan
జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి కావాలన్న బలమైన కోరిక ఉన్న యువనాయకుడు. కానీ కోరిక ఒక్కడి ఉంటే సరిపోదు కదా.. అందుకు తగిన అంగబలం, అర్థబలం,మేథో బలం అవసరమే. అందులోనూ చంద్రబాబు వంటి సీనియర్ నేతను ఎదుర్కోవాలంటే ఇవన్నీ కలసికట్టుగా ఉంటే తప్ప సాధ్యం కాదు. మరి జగన్ పరిస్థితి ఏంటి.. గత ఎన్నికల్లో ఒకటి, రెండు శాతంతో చేజారిన పీఠం ఇప్పుడైనా వరిస్తుందా.. 


ప్రస్తుతం ఏపీ రాజకీయాలు పరిశీలిస్తే క్రమంగా పరిస్థితులు జగన్ కు అనుకూలంగా కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో చంద్రబాబు అనుభవం చూసి ఆయనకు పట్టంగట్టినా.. అందుకు తగిన ఫలితం చంద్రబాబు చూపించలేకపోయారనే చెప్పాలి. అంతేకాకుండా కేంద్రం నుంచి నిధులు రప్పించడంలో తానే విఫలమయ్యాయని చంద్రబాబే స్వయంగా ఒప్పుకుంటున్నారు. 


మితిమీరిన నాయకుల అవినీతి టీడీపీ సతాయిస్తోంది. అయితే ఇదే సమయంలో వైసీపీ బీజేపీకి దగ్గర కావడం ఆ పార్టీకి మేలు కన్నా కీడు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీని కేంద్రం మోసం చేసిందన్నది పార్టీలకు అతీతంగా జనం ఫీలవుతున్నారు. ఇలాంటి సమయంలో బీజేపీతో సఖ్యత అనేది జగన్ కొంప ముంచే అవకాశాలు ఉన్నాయి. 


వాస్తవానికి బీజేపీ, వైసీపీలకు ఇంతవరకూ స్నేహం అని అనుకోవడమే కానీ పార్టీల పరంగా అలాంటి చర్యలు లేవు. కానీ మోడీని గట్టిగా విమర్శించకపోవడం వైసీపీకి పెద్ద మైనస్ గా మారింది. ఇదే తీరు కొనసాగించినా.. బీజేపీతో స్నేహం చేసినా పొత్తు పెట్టుకున్నా..జగన్ మరోసారి పరాజయం కావడం ఖాయం అన్న వాదన బలంగా వినిపిస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: