దేశంలో జాత్యహంకార దాడులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి

KSK
భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక దేశంలో కులాల గొడవలు మతాల గొడవలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ఇప్పటికే చాలామంది దేశంలో ఉన్న ప్రముఖులు దేశంలో మత స్వేచ్ఛ లేదు అంటూ పలుచోట్ల బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా దేశంలో దళితులపట్ల వివక్షత నెలకొంటుంది.

ఇటీవల గుర్రంమీద తిరుగుతున్నాడని గుజరాత్ రాష్ట్రంలో ఓ దళితుడిని చెట్టుకు కట్టేసి చాలా తీవ్రంగా రాక్షసంగా ప్రవర్తించి చంపేశారు అగ్రవర్ణ కులానికి చెందిన యువకులు. దళితుల పట్ల ఎక్కువగా బిజెపి పాలిత రాష్ట్రాలలో దాడులు జరుగుతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కానిస్టేబుల్ ఎంపికకు హాజరైన దళిత యువకుల పట్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా ప్రవర్తించింది.

ఈ విషయం సోషల్ మీడియాలోకి రావడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రతిపక్ష పార్టీలు భారతీయ జనతా పార్టీపై మండిపడుతున్నాయి. అసలు విషయమేమిటంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన రెండువందల మంది అభ్యర్థులకు పోలీసు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా ఎంపికైన దళిత అభ్యర్ధుల ఛాతీలపై ఎస్సీ, ఎస్టీ మిగతా అభ్యర్హుల ఛాతీలపై  ఓబీసీ, జనరల్ అని రాశారు. దీంతో ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ట్విటర్లో బీజేపీ పార్టీపై మండిపడ్డారు. ఇది రాజ్యాంగంపై జరిగిన దాడి అని రాహుల్ అన్నారు. ఆర్ ఎస్ ఎస్ భావజాలం నుంచే ఇటువంటి ఆలోచన వచ్చిందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: