సింగపూర్ తరహా చంద్రబాబు నిర్మాణాలు - తొలివానకే కారిపోతున్నాయి?

ఒకసారి నిజాయతీగా మాట్లాడుకుందాం. అసలు కేంద్రం సచివాలయం కట్టటానికే చంద్రబాబు మాటల ప్రకారం సొమ్ములు ఇవ్వటం లేదు. అంటే రాజధానికి కేంద్రం సరిగ్గా ఆర్ధిక సహకారం చేయనప్పుడు మనమెంత కరక్టుగా ఉండాలి? ఉన్న ఆర్ధిక వనరులను నిజాయతీగా వినియోగించుకుంటే తప్ప రాజధాని నిర్మాణం పూర్తిగాదు. అలాంటి పరిస్థితుల్లో తాత్కాలిక నిర్మాణాల పేరుతో భవన సముదాయాలు కట్టటం ఎంతతప్పో, హైదరాబాద్ నగరాన్ని ఒక దశాబ్ధం పాటు రాజధానిగా వినియోగించుకునే అవకాశం వదిలేయటం మహానేరం, అని ఇప్పుడున్న పరిస్థితుల్లో అనిపించకమానదు.


పోనీ తాత్కాలిక సచివాలయమైనా సరిగా నిర్మించారా అంటే దానికి సమాధానం చిన్నపాటి వర్షానికే తొలిసారి లీకులు ఏర్పడ్డాయి. తాత్కాలిక నిర్మాణాలకే చదరపు అడుగుకు అసాధారణ ధరల్లో ఖర్చు పెట్టారని వినికిడి. కొన్ని వందల కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన ఆంధ్ర ప్రదేశ్ తాత్కాలిక సచివాలయం తొలినాళ్ళ నుంచి చిన్న చిన్న వాననీటికే లీకులతో ప్రధాన వార్తల్లోకి ఎక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. గత ఏడాది జూన్ లో కురిసిన చిన్నపాటి వర్షానికి తొలిసారి సచివాలయం వాన జల్లులకే కారిపోయింది. వివిధ మంత్రుల చాంబర్లలోకి వాన నీరు వరదై పారింది. 


అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం అందులో కుట్ర కోణాన్ని అనుమానించింది. ప్రతిపక్ష వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాంబర్‌ లోకి నీళ్లు కారి, ప్రవహించటంతో, కుట్ర కోణం ఉండవచ్చునని ప్రభుత్వంలోని పెద్దలేకాదు కొందరు మంత్రులు, సభాపతి కూడా బహిరంగంగానే ప్రతిపక్షం పాత్ర ఇందులో ఉండిఉండొచ్చని  భావించట మేకాదు, బహిరంగంగానే ప్రతిపక్షాన్ని వాయించేశారు. చివరకు నిజనిర్ధారణకు దానిపై విచారణకు ఒక కమిటీ కూడా వేశారు. 

అంతటితో భవనాలు కారిపోవటం ఆగలేదు ఆ మాట అటుంచితే ఆ తర్వాత కూడా అంటే నిన్న ఏపీ సచివాలయ భవనాలు కారి వరదై చివరకు  జలమయమైంది. గత ఏడాది పలుమార్లు ఇలాంటి లీకేజీలు చోటు చేసుకోగా, తాజాగా నిన్న మంగళవారం మరోసారి అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. సచివాలయ పరిసర ప్రాంతాల్లో నిన్న కురిసిన వర్షానికి మళ్లీ లీకేజీలు ఏర్పడ్డాయి. ఈసారి కూడా వైఎస్ జగన్ చాంబర్‌ తో సహా వివిధ హాల్స్‌ లో వాన నీరు లీకైనాయి. నిన్న "మే-డే" పబ్లిక్ హాలిడే కావడంతో ఉద్యోగులు ఎవరూ రారు కబట్టి లీకుల గోల అంత ఇబ్బంది పెట్టలేదు. దీంతో ఈ లీకేజీలతో పనులకు అవాంతరం ఏర్పడ లేదు. 

మన పాలన నిప్పు మనం నిజాయతీ పరులం అని చెప్పుకునే వారి పాలన లో నిర్మాణమైన భవనాలు ఇలా లీకైపోతూ ఉంటే ఆయన పాలనలోని నిజాయతీ ఎంత? సింగపూర్ తరహా నిర్మాణాల్లోని డొల్లతనం చక్కగా కనిపిస్తుంది. నిర్మాణాల్లో నిప్పెంత?  అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఇలా జరుగుతూ ఉంటే రానున్న వర్షాకాలం మొత్తం ఈ సచివాలయ లీకుల వారతలతోనే అన్నీ పత్రికల హెడ్లైన్స్ నిండి పోతా యేమో? బాబు గారి నిప్పు ఆరిపోవచ్చు గూడా? ఇంత చిన్న దాంట్లోనే ఇంత కక్కుర్తి ఉంటే పోలవరం, పట్టిసీమ నిజమైన కథలు బయటికివస్తే? ఏంజరుగుతుందో? బహుశ సిబిఎన్ కు నిధులు కేంద్రం ఇవ్వట్లేదంటే నిధులు కూడా ఇలా లీకుల్లో కారిపోతాయనే భయం కావచ్చేమో?  ఒక సారి ఆలొచించండి?   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: