పవన్ ను ఆశ్చర్య పరుస్తున్న చంద్రబాబు మౌనం !

Seetha Sailaja
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి చంద్రబాబునాయుడుకు అపర చాణుక్యుడు అన్న పేరుంది. తన 40 సంవత్సరాల సుధీర్ఘ అనుభవంతో ఏనాయుకుడుకి ఎక్కడ చెక్ పెట్టాలో బాబుకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు అని కూడ అంటారు. ఈఅభిప్రాయాలకు కొనసాగింపుగా బాబు ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ పై అనుసరిస్తున్న లేటెస్ట్ వ్యూహం రాజకీయ వర్గాలలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొన్న తిరుపతిలో జరిగిన చంద్రబాబు ‘ధర్మ పోరాట దీక్ష’ లో గంటన్నర సేపు సుదీర్ఘంగా మాట్లాడిన బాబు ఒక్క విమర్శ కూడ పవన్ కళ్యాణ్ పై చేయలేదు. 

అదేవిధంగా బాబు ఉపన్యాసానికి ముందుమాట్లాడిన నారా లోకేష్ దగ్గర నుండి అనేకమంది తెలుగుదేశం నాయకులు కూడ పవన్ ను ఒక్క మాట అనలేదు. చంద్రబాబు దగ్గర నుండి ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం నాయకులు అంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడమే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీతో ఎలా లాలోచి పడింది అన్న విషయాలను హైలెట్ చేసారు కానీ తమకు లేటెస్ట్ శత్రువుగా మారిన పవన్ కళ్యాణ్ పై ఒక్క మాట అనకపోవడం ఇప్పటి లేటెస్ట్ ట్విస్ట్. 

దీనితో పవన్ ను ఇగ్నోర్ చేసే స్ట్రాటజీని అనుసరిస్తూ తమకు ఏదైనా పోటీ ఉంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ నుండి ఉంటుంది కానీ పవన్ ఏమాత్రం బలం లేని బలహీన శత్రువు అన్న సంకేతాలు ఇవ్వడానికే అటు చంద్రబాబు కానీ ఇటు లోకేష్ కానీ తమ ఉపన్యాసాలలో పవన్ ప్రస్తావన తీసుకురాలేదు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇది ఒక విధంగా పవన్ కు ఊహించని షాక్ అని అంటున్నారు. తెలుగుదేశం నాయకులు ముఖ్యంగా చంద్రబాబు లోకేష్ లు పవన్ పై తీవ్ర విమర్శలు కురిపిస్తే దానికి రెట్టింపు స్థాయిలో మాటల దాడి చేయడానికి పవన్ ఇప్పటికే చాల హోమ్ వర్క్ చేసాడు అన్న వార్తలు ఉన్నాయి. అయితే అనుకోని విధంగా చంద్రబాబు ఇప్పుడు పవన్ విషయంలో మౌనం వహిస్తున్న నేపధ్యంలో పవన్ కు చంద్రబాబు పై ఎదురు దాడి చేసే అవకాశాలు తగ్గిపోతున్నాయి. 

దీనితో ఎలర్ట్ అయిన పవన్ తన వ్యూహం మార్చి అతిత్వరలో తాను జనం మధ్యకు వెళ్ళబోతున్నానని ప్రకటించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విభజన హామీల అమలులో మోసం చేసిన ప్రభుత్వాలను ఎండగడతాను అంటూ వార్నింగ్ బెల్స్ మ్రోగించాడు. అంతేకాదు రాబోతున్న ఎన్నికలలో తన ‘జనసేన’ ఆంధ్రప్రదేశ్ లోని 175 స్థానాలలోనూ పోటీ చేస్తుందని స్వయంగా ప్రకటించి తాను కూడా బలమైన శక్తినే అనే సంకేతాలు ఇస్తున్నాడు పవన్. దీనితో వైఎస్ఆర్ కాంగ్రెస్ తో పాటు సమానంగా పవన్ ను టార్గెట్ చేయవలసిన పరిస్థితి చంద్రబాబుకు ఏర్పడేలా వ్యూహాత్మక ఎత్తులు వేస్తున్నాడు జనసేనాని..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: