కాబోయే సీఎం జగన్ ... బిజెపి ఆసక్తి కరమైన వ్యాఖ్యలు..!

Prathap Kaluva

కాబోయే సీఎం జగన్ అని సర్వేలు చెబుతున్న మాటలు కాదు. వైసిపి శ్రేణులు చెబుతున్న మాటలు కూడా కాదు. కాబోయే సీఎం జగనే అని బిజెపి నేత విష్ణు కుమార్ రాజ్ చెబుతున్నాడు. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో ప్రస్థుత పరిస్థితులను చూసి చెబుతున్నాని, దీనికి ఎటువంటి దీనికి ఎటువంటి జ్యోతిష్యం అవసరం లేదని బిజెపి నేత చెప్పాడు. సింపుల్ మ్యాథమాటిక్ కాలిక్యులేషన్. కుటుంబపాలనకు స్వస్తి చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకుంటున్నారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు.


తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు విష్ణుకుమార్ రాజు. గతంలో కూడా విష్ణుకుమార్ ఇదే మాట చెప్పారు. కేవలం చంద్రబాబుపై కోపంతో తను ఇలా చెప్పడం లేదని, రాష్ట్రవ్యాప్తంగా పరిస్థితులు, ట్రెండ్ ను అంచనా వేసుకొని ఈ మాట చెబుతున్నానని గతంలో ప్రకటించారు. తాజాగా మరోసారి అదే మాట అన్నారు. కేవలం కేసులకు భయపడి చంద్రబాబు, బెజవాడలో దాక్కున్నారని ఆరోపించారు విష్ణుకుమార్ రాజు.


నోటుకు ఓటు కేసులో పోలీసులు అరెస్ట్ చేస్తారని భయపడి చంద్రబాబు హైదరాబాద్ నుంచి విజయవాడుకు పారిపోయి వచ్చారు. ఇలాంటి వ్యక్తి బెంగళూరులో ఉన్న ఆంధ్ర ప్రజలకు బీజేపీకి ఓటు వేయొద్దని చెప్పడం విడ్డూరంగా ఉంది. అనవసరంగా ఆంధ్రప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్ని చంద్రబాబు క్రియేట్ చేస్తున్నారు అని చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: