గల్లా అరుణ కుమారి సంచలన నిర్ణయం..!

siri Madhukar

మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత గల్లా అరుణ కుమారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు పార్టీలో తగిన గుర్తింపు లేదని సీనియర్ రాజకీయ నాయకురాలైన తనను టీడీపీ అధిష్టానం నిర్లక్ష్యం చేస్తోందని, ఆమె బుధవారం టీడీపీ అధిష్ఠానానికి షాక్ ఇచ్చారు. చంద్రగిరి నియోజకవర్గ ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, తన కుమార్తెను కానీ మరొకరిని కానీ బరిలోకి దింపే ఆలోచన కూడా లేదని ఆమె స్పష్టం చేశారు. చంద్రబాబును స్వయంగా కలిసి ఈ విషయాన్ని ఆయనకు తెలియజేశానని చెప్పారు.


వయోభారం కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.   సుదీర్ఘ కాలం కాంగ్రెస్ లో ఉండి మంత్రిగా కొనసాగిన అనంతరం గత ఎన్నికల సందర్బంగా టీడీపీలో చేరిన గల్లా కుటుంబం పట్ల టీడీపీ అధిష్టానం  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆమె మధనపడిపోతున్నారట. తనని కాదని వైసీపీ నుంచి టీడీపీలో చేరిన అమర్నాధ్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారన్న అసంతృప్తి ఆమెలో ఉందంటున్నారు.


అంతే కాదు రెండున్నరేళ్ల క్రితం ఎమ్మెల్సీ స్థానాన్ని అరుణ ఆశించినప్పటికీ... ఆ స్థానాన్ని గాలి ముద్దు కృష్ణమనాయుడికి ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె అసంతృప్తికి లోనవుతున్నారని చెబుతున్నారు. మరోవైపు, వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన అమరనాథరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో ఆమె అసంతృప్తి మరింత ఎక్కువైందని సమాచారం.


గల్లా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల టీడీపీ నేతలు షాక్ అవుతున్నారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని  టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమెను కోరినట్టు తెసులుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: