చంద్రబాబు పై భగ్గుమంటున్న నిరుద్యోగులు

KSK
గత ఎన్నికలలో అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తాం అంటూ చంద్రబాబు రాష్ట్రంలోని యువతకు హామీ ఇచ్చారు. అయితే తీరా అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాలుగు సంవత్సరాలు గడిచినా కానీ ఇప్పటికీ నిరుద్యోగులకు కనీస ఉపాధి కల్పించలేదు అలాగే నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు. ఈ క్రమంలో ప్రతిపక్షనేత వైసీపీ అధినేత జగన్ ప్రజా సంకల్ప పాదయాత్రకు పూనుకున్నప్పుడు...జగన్ పాదయాత్రలో ఎక్కువగా యువత కనబడటంతో చంద్రబాబు అండ్ తెలుగుదేశం పార్టీ నాయకులకు వెన్నులో వణుకు పుట్టినట్టు ఉంది...వెంటనే గతంలో తాను ఇచ్చిన హామీ నిరుద్యోగ భృతిని తెరమీదకు తీసుకువచ్చారు.

సంక్రాంతి పండగ నుండి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగికి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో మంత్రి లోకేష్ సారధ్యంలో కమిటీ కూడా వేసినట్లు అప్పట్లో తెలిపారు. సంక్రాంతి పండుగ నుండి మే నెల ఇప్పటివరకు ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి కార్యాచరణ కూడా మొదలు కాలేదు.

అయితే తాజాగా రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ జూన్ నెల నుండి నిరుద్యోగ పరిహారం ఇస్తున్నట్లు పేర్కొన్నారు అది కూడా డిగ్రీ పూర్తయిన వారికి మాత్రమే ఇస్తాం అని చెబుతున్నారు. పది తర్వాత చదివిన వారికి ఏదైనా ఉపాధి, శిక్షణ అవకాశాలకు మార్గాలు చూపిస్తారట. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రకటనతో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు చంద్రబాబుపై తెలుగుదేశం పార్టీపై భగ్గుమన్నారు.

బాబు వస్తే జాబు వస్తుంది అని మేము చంద్రబాబుకు ఓటు వేస్తే మమ్మల్ని మోసం చేస్తారా అంటూ లబోదిబోమంటున్నారు. అంతే కాకుండా మరికొంత మంది నిరుద్యోగులు ఆయన కుమారుడు కనీసం వార్డు మెంబర్ కాకుండా మంత్రి అయ్యాడు అని చంద్రబాబు పై సెటైర్లు వేస్తున్నారు. చంద్రబాబుకు ఓటు వేసినందుకు మాకు బాగా బుద్ధి చెప్పారు..రాబోయే ఎన్నికలలో మేము ఏంటో చూపిస్తామని మరికొంతమంది యువకులు పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: