రోజాపై సంచలన వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత

Edari Rama Krishna
గత కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ వర్సెస్ వైసీపీ మద్య మాటల యుద్దం భారీ స్థాయిలో నడుస్తుంది.  ఇక ప్రతిపక్ష హోదాలో ఉన్న వైసీపీతో అధికార పార్టీకి ఎప్పుడూ ఏదో ఒక విషయంలో రగడ జరుగుతూనే ఉంది.  తాజాగా ఏపీలో ప్రతిపక్ష పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే రోజా మొన్న గుంటూరు జిల్లా దాచేపల్లిలో జరిగిన అత్యాచార ఘటనపై పెద్ద ఎత్తున గొడవ చేశారు.  ఈ సందర్భంగా టీడీపీ ముఖ్యమంత్రి అసమర్ధుడు అని..చేతకాని నాయకుడని..ఏపీలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నాశనం అయ్యిందని..వెంటనే సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రోజా  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మహిళా మంత్రులు, పోలీసులపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  తాజాగా ఎమ్మెల్యే వ్యాఖ్యలపై స్పందించిన టీడీపీ నేత యరపతినేని శ్రీనివాసరావు ఆమెపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ, ‘రోజాను మహిళ అని చెప్పడానికి కూడా సిగ్గుచేటుగా ఉంది. ఆమె ఒక బరితెగించిన మహిళ. ఒక శాసనసభ్యురాలై ఉండి.. అసెంబ్లీ సాక్షిగా ‘నన్ను దమ్ముంటే రేప్ చేయండి’ అని మాట్లాడిన వ్యక్తి రోజా.

అటువంటి వ్యక్తి కూడా చంద్రబాబు గురించి, ప్రభుత్వం గురించి మాట్లాడటం సిగ్గుచేటు.  అంతే కాదు  దాచేపల్లి ఘటనలో నిందితుడు సుబ్బయ్య వైసీపీకి చెందిన వ్యక్తి. ప్రతిపక్షంలో ఉండి అకృత్యాలకు పాల్పడటం, అత్యాచారాలు చేయడమే కాకుండా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోయడం దారుణం.  దాచేపల్లి ఘటన జరిగిన వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి నింధితుడు ఎవరైనా కఠినంగా శిక్షించాలని ఆర్డర్ వేశారని..ఆ చిన్నారికి సానుభూతి తెలిపారని అన్నారు.

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ కూడా ఇచ్చారని..అయినా ప్రతిపక్ష పార్టీ సభ్యులు కావాలని రాద్దంతం చేశారని అన్నారు.దాచేపల్లి సంఘటనలో ముందుగా బాధిత బాలికకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలి. ఆ బాలిక భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చూడాలని మానవత్వంతో ప్రభుత్వం ఆలోచించింది’ అని చెప్పుకొచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: