పవన్ కళ్యాణ్ పిలుపుకు అంత దృశ్యం లేదు - పెరిగిన టీఆర్పీలే ఋజువులు

ప్రజాస్వామ్యంలో ప్రజలు తమకు నచ్చిందే చేస్తారు. నచ్చంది చచ్చినా చేయరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక నాలుగు టీవి ఛానెళ్ల పై నిషేధం ప్రకటించిన విషయం జగమంతా తెలిసిందే. పవన్ కళ్యాణ్ టివీ9, టీవి5 ABN, ఛానళ్లను చూడొద్దని అభిమానులకు ఇచ్చిన పిలుపుకు స్పందించిన వారు ఏదో చేసేస్తామని ఇక చానళ్లని చూడమని బాగానే రెచ్చిపోయారు. 

అయితే కొంత మంది గతి మతి తప్పిన అభిమానులు ఏకంగా తమ ఇళ్లలోని కేబుల్స్ కూడా పీకించుకున్నారు. పవన్ కళ్యాణ్ అతని అభిమాన గణాలు ఎంత హాంగామా చేసిన పెద్దాగా కాదు కదా కించిత్తు లాభం కూడా లేకుండా పోయింది. మా దేవుడు పవన్ చెప్తే ఏదైన చేసేస్తామన్న అభిమానులు ఏమీ చేయలేక పోయారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు తర్వాత ఏ ఛానెల్స్ అయితే చూడొద్దన్నాడో ఆ ఛానళ్లకు అద్భుతమైన రేటింగ్స్ వచ్చాయి. కేవలం ఒక హీరో చెప్తే టీవి చూడటం మానేసేంత అమాయకు లు లేరని బయట పబ్లిక్ ఎద్దేవ చేస్తున్నారు. 

ప్రజాస్వామ్యంలో సమాచార సంగ్రహణ ఒక హక్కు. శ్వాస ఎంత ముఖ్యమో సమాచార సేకరణ అంత ముఖ్యం. అసలు పేపర్ చదవద్దు, టివి చూడొద్దు అనేవి ఫ్యూడలిస్టిక్ తరహా ఆదేశాలు మాత్రమే. వాటిని ఎంత కఠినంగా అమలు చేయ ప్రయత్నిస్తే అవి అంత భళ్ళున బయట పడి విస్పోఠనం సృష్టిస్తాయి. కాకపోతే పవన్ అనుకున్నది జరగక పోగా ప్రజాస్వామ్య సుగుణం మరోసారి ఋజువైంది. ఎంత బలంగా అణచివేస్తే అంత వేగంగా బరష్ట్ అవుతూ నింగికి ఎగసేదే సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: