కర్ణాటకలో కట్టల పాములు.. ఎన్నికోట్లు దొరికాయో తెలుసా..?

Chakravarthi Kalyan

కర్నాటక ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు నోట్ల కట్టలు వెదజల్లుతున్నాయి. ఎక్కడిక్కడ జరుగుతున్న తనిఖీల్లో కోట్లకు కోట్లు దొరికిపోతున్నాయి. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న తనిఖీల్లో కర్ణాటకలో ఇప్పటి వరకూ మొత్తం 160 కోట్ల రూపాయలు దొరికాయి.


ఈ మాత్రం విలువైన నగదు, మద్యం సీసాలను అధికారులు పట్టుకున్నారు. ఓవైపు ఎన్నికల తేదీ దగ్గరపడుతోంది. అందుకే అధికారులు తనిఖీలను ముమ్మరం చేసేశారు. ఆదాయ పన్నుశాఖ, ఎక్సైజ్ శాఖలు కలసికట్టుగా దాడులు చేస్తున్నారు. పార్టీలకు చుక్కలు చూపిస్తున్నాయి.


ఇప్పటివరకూ దొరికిన 160 కోట్ల రూపాయల్లో కేవలం నగదే 75 కోట్ల రూపాయల వరకూ ఉందట. మరో పాతిక కోట్ల రూపాయల మద్యం దొరికింది. మరో కోటి రూపాయలవరకూ బంగారు ఆభరణాలు దొరికాయి. పోలింగ్ సమయం దగ్గపడేకొద్దీ ఇంకెన్ని నోట్ల కట్టలు బయటపడతాయో అన్న ఉత్కంఠ నెలకొంది.


కర్ణాటక ఎన్నికలకు కొన్ని నెలల ముందు నుంచే దక్షిణాదిలో నోట్ల కొరత విపరీతంగా వచ్చింది. ఇందుకు కారణంగా కర్ణాటక ఎన్నికల కోసం నేతలు కోట్లు దాచడం వల్లే ఈ కొరత వచ్చిందన్న వాదన వినిపించింది. ఇప్పుడు ఆ దాచిన సొమ్ములన్నీ నాయకులు బయటకు తీస్తున్నారు. కాకపోతే.. అధికారుల తనిఖీలకు దొరికకుండా సరికొత్త మార్గాల్లో పంపిణీ సాగిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: