దాచేపల్లి బాలిక రేప్‌.. బాబు వాడకం అదిరిపోతోంది..?

Chakravarthi Kalyan

నాయకుడు అంటే ప్రజల ఎమోషన్స్ అర్థం చేసుకోవాలి. ఎన్నికల సమయంలో ఇది మరీ ఎక్కువ ముఖ్యం. ఏపీ సీఎం చంద్రబాబు అదే చేస్తున్నారు. దాచేపల్లిలో బాలికను రేప్ చేసిన ఘటన సంచలనం సృష్టించింది. జనమంతా రోడ్లపైకి వచ్చారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ ఎమోషన్ ను సీఎం అర్థం చేసుకున్నారు.


17 టీములతో నిందితుడిని వెదికించారు. నిందితుడు సుబ్బయ్య అనుమానస్పద స్థితిలో మృతి చెందడంతో కథ సుఖాంతమైంది. కానీ సీఎం దీన్ని పొలిటికల్ గా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. సాధారణంగా రేప్ బాధితుల గురించి మీడియాలో తెలియనివ్వరు. కానీ సీఎం ఏకంగా బాధితురాలి బంధువులతో ప్రెస్ మీట్ నిర్వహించారు.


ఇప్పుడు చంద్రబాబు స్వయంగా లైంగిక వేధింపుల నుంచి బాలికల సంరక్షణ ఉద్యమాన్ని భుజానికెత్తుతున్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు స్వయంగా ముఖ్యమంత్రే అవగాహనా ర్యాలీ నిర్వహించనున్నారు. ఆడబిడ్డల రక్షణగా కదులుదాం అన్న నినాదంతో ర్యాలీ నిర్వహిస్తున్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వరకూ ఈ ర్యాలీ కొనసాగుతుంది.


విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి సీఎం చంద్రబాబు నిర్వహించే ర్యాలీతో పాటు మరో మూడు ర్యాలీలు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బయల్దేర నున్నాయి.మొగల్రాజపురంలోని సిద్ధార్ధ కళాశాల, రాష్ట్ర అతిథి గృహం, బందర్ రోడ్డు నుంచి మరో ర్యాలీ బయల్దేరి ఇందిరాగాంధీ స్టేడియంకు చేరుకుంటాయి. ఈ ర్యాలీ విజయవంతమయ్యేందుకు జిల్లా కలెక్టరేట్లలో ఇతర కార్యక్రమాల్ని రద్దు చేసేశారు. జిల్లాల్లో సోమవారం నాడు ఫిర్యాదుల పరిష్కారం కోసం నిర్వహించే గ్రీవెన్సుడే ను రద్దు చేసేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: