ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడే ఏ-1 నిందితుడా?

కుట్ర బట్టబయలైంది. నేఱం ఎప్పుడో ప్రజల ముంగిళ్ళలో టెలివిజన్ చానళ్ళ సాక్షిగా ఋజువైనా, విచారణ అంటూ సాగదీసి రాజకీయ క్రెడిట్లూ డెబిట్లూ లెక్కేసి మొత్తం మీద అవినీతి నిరోధక శాఖ ముద్దాయి పై చార్జ్ షీట్ వేయనుందని తెలుస్తుంది.  తెలంగాణ లో నమోదైన ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి పేరును ఏ-1 గా చేర్చనున్నారనే మాట ఈ రోజు హాట్ కేక్ లా వినిపిస్తూ ఉంది. తెలంగాణ శాసనసభ కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ ఓటును కొనుగోలు చేయబోయిన వ్యవహారంలో చంద్రబాబు ఇరుక్కున్న సంగతి తెలిసిందే. 

ఇప్పటి వరకూ ఈ కేసులో రెండు చార్జిషీట్లు వేశారు. బ్రీఫ్డ్ మీ  ఆడియో టేప్‌ లోని స్వరం బాబుదేనని  చండీగఢ్‌ ఫోరెన్సిక్‌ సంస్థ ధ్రువీకరించిన సందర్భంగా,  ఇప్పుడు విచారణ చాలా వరకూ పూర్తి అయిన నేపథ్యంలో మూడో చార్జిషీటుకు రంగం సిద్ధం అవుతోందని తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ కేసుపై సమీక్ష నిర్వహిచడంతో రాజకీయ పరిణామాలు బాగా హీటెక్కాయి. తాజాగా తెరపైకి వస్తున్న మూడో చార్జిషీట్లో చంద్రబాబు నాయుడిని ఏ-1 గా చేర్చనున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేని ప్రలోభపెట్టే ప్రయత్నం చేసి నందుకు గానూ ఆయనను ఈ కేసులో మొదటి నిందితు డిగా చేరుస్తున్నారట. కేవలం చంద్రబాబు మాత్రమే గాక ఏపీకి చెందిన మరో మంత్రి కూడా ఈ కేసులో నిందితుడు కాబోతున్నాడనే మాటలు వినిపిస్తుండటం గమనార్హం.

ఆ మంత్రి ఎవరనేది ప్రస్తుతానికి ఇంకా ప్రకటించబడలేదు అంతా సస్పెన్స్. చంద్రబాబు, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డితో పాటు,  తెరాసలో చేరిన ఒక టీడీపీ ఎమ్మెల్యే ను కూడా ఈ కేసులో,  నిందితుడిగా చేర్చబోతున్నట్టుగా తెలుస్తోంది.


ఈ కేసులో చంద్రబాబు ఏ-1 గా బుక్ అయితే ఆయనకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితే అవుతుందని, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఇలా కేసులో ఇరుక్కోవడం విడ్డూరం అవుతుందని, చంద్రబాబు రాజీనామా చేయాల్సిన పరిస్థితి కూడా ఎదురుకావొచ్చునని రాజధానిలో వినిపిస్తున్న మాట. 

"చట్టం ముందు అందరూ సమానులే. చట్ట ప్రకారం వ్యవహరించండి. మీపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండవు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది"  ఓటుకు నోటు కేసును ముఖ్యమంత్రి కేసీఆర్‌ దాదాపు రెండున్నర గంటలపాటు పోలీసు, న్యాయశాఖ ఉన్నతాధికారులతో సమీక్షించిన సందర్భంగా వ్యాఖ్యానించినట్లు తెలిసింది. ఈ సమీక్ష రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. మూడేళ్లుగా స్తబ్దుగా ఉన్న ఈ కేసు ఒక్కసారిగా తెర పైకి రావడంతో ఉభయ రాష్టృఆల్లో రాజకీయంగా ఏదో జరుగబోతుంది అన్న ఆసక్తి నెలకొంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: