బాబు కి బీజేపీ ఫైనల్ వార్నింగ్, జైల్లో పడేస్తాం !!!

KSK
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై బిజెపి పార్టీ నాయకులు మండిపడుతున్నారు. మరి కొద్ది రోజులలో కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ప్రత్యక్షంగా పరోక్షంగా బిజెపి పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు షాకింగ్ కామెంట్స్ చేసారు. చంద్రబాబు ఎన్ని కుయుక్తులు పన్నినా కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ పార్టీ గెలుపును ఆపలేరు అని అన్నారు...కర్ణాటక రాష్ట్రంలో ప్రధాని మోడీకి తెలుగు ప్రజలు నీరాజనం పట్టారని ఈ సందర్భంగా తెలియజేశారు. దీంతో చంద్రబాబు కి మతిపోయిందని పేర్కొన్నారు. చంద్రబాబు మాత్రమే కాక ఉద్యోగ సంఘాల నాయకులు అశోక్ బాబుని కూడా  తమ పార్టీ.. బిజెపికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం కోసం చంద్రబాబు రంగంలోకి దింపారని ఆరోపించారు.

చంద్రబాబు ఇలానే వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. విభజనకు గురై ఎంతో నష్టపోయిన ఆంధ్రరాష్ట్రాన్ని ఆదుకుంటున్నం...కేంద్ర ప్రభుత్వ పథకాలను తమ పథకాలుగా మలచుకొని చంద్రబాబు రాజకీయ లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. అంతేకాకుండా చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం అనేక కోట్లు ఖర్చుపెట్టి ప్రజాధనాన్ని వృధా చేసి దీక్షలు ఉపవాసాలు అంటూ కొన్ని కోట్లు ఖర్చుపెట్టి సామాన్య ప్రజలను ఇబ్బంది పడుతున్నారని అన్నారు.

ఇదిలావుండగా కేంద్ర ప్రభుత్వం వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతుంటే వాటిని కూడా చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం తనవల్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తున్నాయని తనకు అనుకూలంగా ఉన్న మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. కరువు ప్రాంతమైన రాయలసీమ ప్రాంతంలో పెట్టుబడులు తెచ్చామని ఈమధ్య తెగ ఊదర గొడుతున్నారు చంద్రబాబు...ఆయనవల్ల అక్కడ ఏ పరిశ్రమలు వచ్చాయని ఒకసారి బహిరంగంగా లెక్కలతో సహా ప్రజలకు వివరించాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.

ఆంధ్రరాష్ట్రంలో ఇప్పటివరకు పరిశ్రమలు పెట్టుబడులు వస్తున్నాయి అంటే వాటన్నిటి వెనుక కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రోద్బలమే అని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రరాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని అనేక జాతీయ నిఘా సంస్థల విచారణలో బయటపడింది అని అన్నారు. తన రాష్ట్రంలో సరిగ్గా ఏలుబడి చేయకుండా పక్క రాష్ట్రాల వ్యవహారాలలో తలదూరుస్తే చంద్రబాబుకు జైల్లో వెళ్లే అవకాశాలు దగ్గర ఉన్నాయని హెచ్చరించారు జీవీఎల్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: