తెలుగువారి అండతో తప్పక విజయం సాధిస్తాం : సిద్దరామయ్య

Edari Rama Krishna
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ నేతలు హీరోహోరి ప్రచారం చేసిన విషయం తెలిసిందే.  తాజాగా  ర్ణాటకలో బీజేపీని ఓటమి భయం వెంటాడుతోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. నాలుగేళ్ల కాలంలో విజయాలనే కాకుండా, వైఫల్యాలను సైతం ప్రధాని మోదీ చవిచూశారని చెప్పారు. కర్ణాటకలో ఉన్న తెలుగువారంతా బీజేపీని నమ్మడం లేదని, వారంతా కాంగ్రెస్ వెంటే ఉన్నారని తెలిపారు. ఆ మద్య కర్ణాటకలోని తెలుగు వారికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లేఖ రాశారు.

ఈసారి ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ను బలపరచాలని లేఖలో కోరారు. ఎన్నికల హామీలను 95శాతం అమలు చేశాం, మళ్లీ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అంతే కాదు తెలుగువారు, కన్నడిగులది తరతరాల సోదర బంధమని సిద్ధరామయ్య గుర్తు చేశారు. దశాబ్దాలుగా తెలుగువారు ఇక్కడ స్థిరపడి ఇక్కడి సంస్కృతిలో భాగమయ్యారన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా భాజపా ద్రోహం చేసిందని విమర్శించారు.

ఇక కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం చేశామని సిద్ధరామయ్య తెలిపారు. అంతే కాదు తెలుగువారంతా తమకే ఓటు వేస్తారని... వారి అండతో కాంగ్రెస్ ఘన విజయం సాధించబోతోందని చెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, మోసం చేసిన మోదీని తెలుగువారు నమ్మడం లేదని అన్నారు. కాంగ్రెస్ కు 120కి పైగా సీట్లు వస్తాయని... హంగ్ వచ్చే ప్రసక్తే లేదని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం నేర్పబోతున్నామని అన్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: