కర్ణాటకలో ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం...ఆర్‌ఆర్‌నగర్‌ పోలింగ్‌ వాయిదా!

Edari Rama Krishna
కర్నాటక అసెంబ్లీ పోలింగ్‌ శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు జరగనుంది. మొత్తం 224 నియోజకవర్గాల్లో ఎన్నిక జరగాల్సి ఉండగా, జయనగర్‌ బిజెపి అభ్యర్థి ఇటీవల మృతి చెందడంతో ఆ నియోజకవర్గ ఎన్నిక గతంలోనే వాయిదా పడింది. కాంగ్రెస్‌, బీజేపీ ల మధ్య ప్రధాన పోటీ కొనసాగుతుంది. నకిలీ ఓటర్‌ కార్డుల భారీగా దొరికినందుకు ఆర్‌ఆర్‌ నగర్‌ ఎన్నిక వాయిదా పడింది. జయనగర బీజేపీ అభ్యర్థి మృతితో అక్కడ కూడా ఎన్నికను ఎన్నికల కమిషన్‌ వాయిదా వేసింది.

మే 28న రాజరాజశ్వరినగర్‌(ఆర్‌ఆర్‌ నగర్‌) అసెంబ్లీ స్థానానికి తిరిగి పోలింగ్‌ జరుగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. కాగా,  56,696 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3.60 లక్షల మంది పోలింగ్‌ సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. బెంగుళూరు సిటీలో 15,095, బెలగాంలో 891, మైసూరులో 632 కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి, ఆయా ప్రాంతాల్లో పోలీసు పహారా నిర్వహిస్తున్నారు. గోవా, తెలంగాణా, ఆంధ్రా, కర్నాటకకు సంబంధించి లక్షా 50 వేల మంది బందోబస్తులో ఉన్నారు.

  ప్రతి పది పోలింగ్‌ కేంద్రాలను పర్యవేక్షించేందుకు ఓ ఎన్నికల అధికారి, ఒక డిఎస్‌పిని నియమించారు. ఈ మేరకు ఎన్నికల అధికారి సంజీవకుమార్‌ ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.బిజెపి సిఎం అభ్యర్థి యడ్యూరప్ప శివమొగ్గ జిల్లా షికారీపురం నుంచి బరిలో ఉన్నారు. జెడిఎస్‌ అభ్యర్థి కుమారస్వామి చెన్నపట్నం, రామ్‌నగర్‌ నుంచి పోటీలో ఉన్నారు. అధికారం నిలబెట్టుకోవాలని కాంగ్రెస్‌, ఎలాగైనా కర్నాటకలో పాగా వేయాలని బిజెపి, సర్వే ప్రకారం హంగ్‌ వస్తే చక్రం తిప్పాలని జెడిఎస్‌ భావిస్తున్నాయి.

దీంతో కర్నాటక ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇదిలా ఉంటే. దాదాపుగా 4.96 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించనున్నారు.  సీఎం సిద్ధరామయ్య చాముండేశ్వరి, బాదామిల నుంచి పోటీ చేస్తున్నారు. బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప షికారిపుర నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికల కౌటింగ్‌ ఈ నెల15న నిర్వహించి ఫలితాన్ని తెలియజేస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: