ఎన్నికల దగ్గర అయినా వేళ... వైసీపీ లోకి వలసల పరంపర..!

Prathap Kaluva

రాజకీయ నాయకులకు పార్టీ ఫిరాయింపులు పెద్ద విషయం కాదు. ఎన్నికల సమయం లో ఏ పార్టీ కి మైలేజ్ ఉంటె ఆ పార్టీ వైపు దూకేయడం రాజకీయ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ప్రజలు ఏమనుకుంటారో వీరికి అనవసరం. వీరికి కావాల్సింది పదవులు, హోదా మరియు డబ్బులు. అంతే కానీ ప్రజాస్వామ్యం గురించి పట్టించుకోరు.అయితే ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు ఎన్నికలకు సమయం ఆసన్నం అవుతున్న వేళ పార్టీ మారేందుకు చాలా మంది నాయకులూ సిద్ధంగా ఉన్నారని వినికిడి. 


అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశాన్ని వీడిపోవడానికి కూడా పలువురు నాయకులు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల తెలుగుదేశం మాజీ నాయకుడు వసంత నాగేశ్వరరావు కుటుంబం వైకాపాలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన వెటరన్ నాయకుడు గనుక.. మారడంలో వింతలేదనవచ్చు. కానీ.. నెల్లూరు జిల్లాలో కీలక నాయకుడు అయిన ఆనం రామనారాయణ రెడ్డి కూడా వైకాపాలో చేరడానికి మంతనాలు సాగిస్తున్నారని వినిపిస్తోంది.


తెలంగాణలో వంటేరులాగా, ఏపీలో ఆనం ఈ విషయాన్ని ధ్రువీకరించి చెప్పకపోయినప్పటికీ.. జిల్లాలో మాత్రం ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారం బాగా జరుగుతోంది. ఈ నెలలోనే జరగబోతున్న మహానాడు సమయానికి.. ఏయే నాయకులు చురుగ్గా ఏర్పాట్లలో పనిచేస్తున్నారో.. ఎవ్వరు మొహం చాటేస్తున్నారో గమనిస్తే.. వైకాపాలోకి ఫిరాయించే వారికి ఆచూకీ చిక్కుతుందని పలువురు అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: