కన్నా బిజెపి అధ్యక్షునిగా ఎంపిక కొత్తవ్యూహం లో బాగమే? బాబుకు ఇప్పుడు చుక్కలేనా?

బిజెపి జాతీయ అధికార ప్రతినిధి జీవిఎల్ నరసింహారావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే రాజకీయ మార్పులకు అన్ని పార్టీలు సిద్ధంగా ఉండాలని ఇటీవల కర్ణాటక ఎన్నికల సందర్భంగా అన్నారు. ఎపి రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు వస్తాయని, ఇంకా ఆ మార్పులు తేవడానికి తమకు 3నుంచి 6నెలల సమయం చాలునని కూడా అన్నారు. అందు కు తగిన ప్రణాళిక తమ వద్ద ఉందని చెప్పారు. 


అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఆ మాటలన్నారనేది అందరికీ అర్థమైన విషయమే. చుక్కలు చూపిస్తామని కూడా ఆయన చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. అందులో భాగంగానే బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కన్నా లక్ష్మినారాయణను నియమించారనే ప్రచారం ఏపి రాజకీయవర్గాల్లో విస్త్రుతంగా ప్రచారమవుతోంది.


తొలి నుంచీ కాంగ్రెస్ వాది ఐన కన్నా లక్ష్మినారాయణ తెలుగుదేశం పార్టీకి ఆ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని ఆగర్భ శత్రువు. ఆ ఆగర్భ బద్ధశత్రుత్వమే ఏపిలో ఇప్పుడు ఎండిఏ నుండి బయటకు వచ్చి తమ పార్టీపై తమ అధినాయకత్వంపై ప్రేలాపనలకు సిద్దపడ్ద నారా చంద్రబాబు నాయుణ్ణి ధీటుగా ఎదుర్కోవ డానికి పనికి వస్తుందని బిజెపి జాతీయనాయకత్వం భావించి ఉండవచ్చు. 


పైగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మ, కాపు సామాజికవర్గాల మధ్య జాతివైరం పెరుగుతూ ఉంటూ వచ్చింది. 2014సాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో జనసేనఅధినేత పవన్ కల్యాణ్   తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడం వల్ల అది కాస్తా సద్దుమణిగినట్లు అనిపించినా, అంతరాంతరాల్లో ఇరు సామాజిక వర్గాల మధ్య వైరుధ్యం కొనసాగుతూనే ఉన్నది.


అంతే కాదు నారా చంద్రబాబు నాయుడుకు కన్నా లక్ష్మినారాయణ రాజకీయంగా ప్రత్యర్థి కూడా. ఈ వైరాన్ని వినియోగించు కోవటానికి కన్నా లక్ష్మినారాయణ పనికి వస్తారని బహుశా బిజెపి జాతీయ నాయకత్వం భావించి ఉండవచ్చు. అంతే కాకుండా కన్నా లక్ష్మినారాయణకు రాజకీయంగా విశేషమైన అనుభవం ఉంది. ఐదు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు.

నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు. సమైఖ్య ఆంధ్ర ప్రసేశ్ రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెసు కు ఏర్పడ్డ ప్రతికూలత వలన ఆ పార్టీ మరల రాష్ట్రంలో బ్రతికి బట్టగట్టే అవకాశాలు మృగ్యం కావటం తో దాన్ ఇకి రాజీనామా చేసి, 2014 అక్టోబర్ 27వ తేదీన అమిత్ షా నేతృత్వంలో బిజెపిలో చేరారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: