ప్రధానికి ముద్రగడ లేఖ, ఏపి లో చకచకా మారుతున్న రాజకీయ వ్యూహాలు?

ప్రత్యేక హోదా పై ప్రధాని, ముఖ్యమంత్రి ఏ ఒప్పందం చేసుకున్నారో తెలియదని, ప్రత్యేక హోదా సాధన పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ రాష్ట్ర ఖజానా కు నష్టం కలిగిస్తున్నారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాసిన లేఖను శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి లోని తన నివాసంలో ముద్రగడ విడుదల చేశారు.


"అబద్ధాల ముఖ్యమంత్రి నోటుకు ఓటు కేసులో అడ్డంగా దొరికిపోయినా అరెస్టు నుంచి కాపాడమని మీ కాళ్లు పట్టుకోవడం మీరు కాపాడడం వల్ల ఈ రోజు రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిందని" ఆయన లేఖలో పేర్కొన్నారు.


కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం పనులను రాష్ట్ర పర్యవేక్షణలో చేయాలనే నిర్ణయంతో అడ్డగోలుగా అవినీతి జరుగుతోందని లేఖలో పేర్కొ న్నారు. ప్రకృతి ప్రసాదించిన ఇసుకను సైతం ఉచితం పేరుతో కోట్లాది రూపాయల్లో దోపిడీ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సీఎం అవినీతిపై సీబీఐ, ఇన్‌కంటాక్స్‌, ఈడీ ద్వారా దర్యాప్తు చేయించి రాష్ట్రాన్ని, ప్రజలను కాపాడాలని లేఖలో ప్రధానిని కోరారు.


ఇటీవల ముద్రగడ పద్మనాభం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అవటానికి పూర్వమే కన్నాలక్ష్మి నారాయణను కలసి మాట్లాడటం జరిగిందనేది  కాకతాళీయమా? భిజెపి వ్యూహమా? కాపు నాయకులందరూ పవన్ కళ్యాణ్ తో సహా ఏకమై బాజపా గూటికి చేరే ప్రణాలిక సిద్దమైందా? ఆనేది రాష్ట్ర రాజకీయ విశ్లేషకుల అభిభాషణ.


ఆంధ్రప్రదేశ్ లో చాలా కాలంగా కాపుల నాయకుడుగా ముద్రపడ్డ ముద్రగడ పధ్మనాభం తాజాగా కన్నా లక్ష్మీ నారాయణను కలవడం సంచలనమే అయ్యింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ నియమితులై పరిస్థితులు అనూహ్యంగా మారిపోయాయి.  కాగా, ముద్రగడ పద్మనాభం, కన్నా ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపారు. అనంతరం సుమారు అరగంటపాటు పలువిషయాలు చర్చలు జరిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ క్రమంలో కన్నా ఇంటి వద్దకు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు అభినందనలు తెలియజేశారు.


పనిలో పనిగా సోము వీర్రాజుకు ఎన్నికల నిర్వహణకు సంధానకర్త గా అతి ముఖ్యమైన పదవే ఇచ్చి ఎన్నికలవేళ ఆయనకు అరుదైన బహుమతితో సంతృప్తి పరచారు. దీన్నిబట్టి ప్రత్యేక ఉద్యమం వైసిపి ట్రంప్ కార్డ్ అవుతుంది. ఎవరికి ప్రత్యేక హోదా క్రెడిట్ దక్కకుండా వైసిపి మానేజ్ చేయగా, కాపులందరూ క్రమ క్రమంగా బిజెపిలోకి ప్రవహిస్తారని అర్ధమౌతుంది. ఇంతలో నాలుగు దశాబ్ధాల అనుభవం టిడిపికి మోయరాని భారమై ప్రజా ప్రతినిధులు తమ తమ దారి తాము చూసుకొనే పరిస్థితులు నెల కొంటాయి. ఒకప్రక్క పచ్చ పార్టీ,  దాని భజనపరులు, భజన  మీడియా సొద భరించలేని ప్రజలు ఒక్కసారిగా టిడిపిని వదిలించు కోవాలని అనుకుంటే రాష్ట్రంలో కొత్త సమీకరణాలు ఊహించని మలుపు తీసుకొనే అవకాశాలున్నాయని విశ్లేషకుల మాట.


ఐతే ఇదంతా చంద్రబాబు అన్నట్లు బిజెపి కర్ణాటక ఎన్నికల తరవాత ఏపి పై ఫోకస్ పెడుతుందని అప్పుడు ప్రజలు తనకు రక్షణగా నిలవాలని కోరిన పరిస్థితులు ఆంధ్ర ప్రదేశ్ ముంగిట్లోకి వస్తున్నాయని పిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: