బాబు పక్కలో బాలయ్య బల్లెం

రెండు పర్యాయాలు అధికారానికి దూరమై దిక్కుతోచని స్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీకి బాలయ్యరాక కాస్తా కలసి వచ్చినా...ఆయన బాబు పక్కలో బల్లెమేనని అంటున్నారు,రాజకీయాలు తెలిసిన ఆపార్టి శ్రేణులు బల్లెం అని తెలిసే దానిని బాదాం లడ్డూగా చేసుకున్నాను కదా అన్నహుషారేమో చంద్రబాబుది. పైగా పిల్లనిచ్చి కాదు,పిల్లను తనఇంటికి తెచ్చుకుని వియ్యమందారు. కాబట్టి కూతురు కోసమైనా కాటు వేయడం కాదు కదా అలా ప్రయత్నం చేసే నందమూరి కుటుంబం నుంచి తనకు రక్ష అన్న ఆలోచన చంద్రబాబుది. నిజమే కావచ్చు ఇప్పటికిప్పడైతే చంద్రబాబు అనుకుంటున్నదే జరుగుతుంది. కాని భవిష్యత్తు అలాగే ఉంటుందని భరోసాతో ఉంటే ఒకప్పటి చంద్రబాబు లాగా మారడన్న గ్యారంటీ ఏంటి అంటున్నారు కొందరు.ఎందుకంటే చుట్టం చుట్టమే,వ్యాపారం వ్యాపారమే కదా...అయినా మన పిస గాని ఈసూత్రాన్ని నిలువెల్ల సొంతం చేసుకున్న బాబు కు తెలియదనుకోవడం మన పిచ్చి. ఒకప్పుడు తాను పాటించిన నీతిని మరొకరు పాటించరని ఆయన మాత్రం ఎందుకనుకుంటారు. అల్లుడే కదా అని అతివిశ్వాసంతో ఉన్న మహావ్యక్తి మన దివంగత మాజిముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకు తగిలిన ఎదురు దెబ్బ గూర్చి తెలియని వారెవరు. అయినా అధికారం కోసం అందివచ్చిన అడ్డదారులన్నీ తొక్కుతున్న కుళ్లు రాజకీయాలు జరుగుతున్న ఈరోజుల్లో ఇంకా సెంటిమెంట్ తో చేతికి వచ్చే అధికారాన్ని ఎవరైనా వదులుకుంటారా... అయినా ఇలాంటి తరుణం వస్తుందో లేదో తెలియని ఈసమయంలో దీనిగూర్చి చర్చించడం దండగేనని అనుకోవచ్చు కాని గతాన్ని గుర్తుచేసుకుని జరగే అవకాశాలున్న దానిగూర్చి ఒకసారి మననం చేసుకోవడం కూడా మంచికే కదా... 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: