సునందా పుష్కర్ కేసు ఛార్జిషీట్ లో శశిథరూర్

Edari Rama Krishna
ఆ మద్య భారత దేశంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన  సునందా పుష్కర్ ఆత్మహత్య కేసులో ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీట్ లో ఆమె భర్త, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ పేరును చేర్చారు. సునందా పుష్కర్ ఆత్మహత్య కేసులో అనుమానితుడిగా థరూర్ పేరును చేరుస్తూ తాజాగా పోలీసులు పాటియాలా హౌస్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు.  306, 498ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సునందా పుష్కర్ మృతి కేసు విచారణను ఈ నెల 24కు కోర్టు వాయిదా వేసింది. సునందను ఆత్మహత్యకు ప్రేరేపించారని శశిథరూర్‌పై ఛార్జిషీట్‌లో ఆరోపించారు. 

2014, జనవరి 17న ఢిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్ లోని తన గదిలో సునంద పుష్కర్ శవమై పడి ఉండగా గుర్తించారు. ఆమె మృతికి విష ప్రయోగం, మోతాదుకు మించి డ్రగ్స్ తీసుకోవడం కారణమని తదితర అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఐతే, సునంద పుష్కర్ ఆత్మహత్య చేసుకొందని పోలీసులు నిర్ధారించారు. 

ఈ కేసులో ఎవరిపైనా ఎలాంటి ఆధారాలు కనుగొనలేదని ఢిల్లీ హైకోర్టులో లా అధికారి ఒకరు ప్రకటించారు. ఇది జరిగిన సరిగ్గా 6 నెలలకే నేను ఆత్మహత్యకు ప్రేరేపించానని అంటున్నారు. ఇది ఏమాత్రం నమ్మశక్యంగా లేదు' అని మరో ట్వీట్‌లో శశిథరూర్ పేర్కొన్నారు. 2014 జనవరి రాత్రి 5స్టార్ హోటల్ గదిలో సునంద అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

ఈ కేసు విచారణలో జరుగుతున్న జాప్యంపై ఢిల్లీ పోలీసులపై కోర్టు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎట్టకేలకు నాలుగేళ్ల తర్వాత ఢిల్లీ పోలీసులు ఓ కంక్లూజన్‌కు వచ్చారు.సునందను ఆత్మహత్యకు ప్రేరేపించారని చార్జిషీట్ లో పోలీసులు శశి థరూర్ పై ఆరోపణ నమోదు చేయడంతో  ఆమె ఆత్మహత్య చేసుకుందని దాదాపు నిర్ధారణ అయ్యింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: