చారిత్రక గుడిలో అడుగు పెట్టిన మోడీ..ఆ ఫలితం కోసమేనా!

KSK
మోడీ ప్రధాని అయ్యాక ఎక్కువగా విదేశీ పర్యటనలు చేస్తూ కేవలం ఎన్నికల సమయంలో దేశంలో హడావిడి చేస్తూ ప్రజలకు కనబడుతూ ఉంటారు. అంతేకాకుండా మోడీ పర్యటించే ప్రాంతాలలో ఎక్కువగా ఆధ్యాత్మికం సంతరించుకున్నే విధంగా...ఏదో ఒక గుడికి వెళుతూనే ఉంటారు. తాజాగా నరేంద్ర మోడీ నేపాల్ దేశంలో పర్యటిస్తున్న సందర్భంగా ఆ దేశంలో ఒక గుడికి వెళ్లడంతో ప్రస్తుతం ఈ విషయం దేశంలో చర్చనీయాంశమైంది. అయితే మోడీ ఈ మందిరం దర్శించుకోవడం వెనుక కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉండాలని..అందుకే నేపాల్ లో చారిత్రక మందిరాన్ని దర్శించుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 

నేపాల్ లో ప్రధాని మోడీ సందర్శించిన దేవాలయాల్లో ఒకటి జానకీ మందిర్. దీన్ని నౌ లాఖ్ మందిర్ అని కూడా వ్యవహరిస్తుంటారు. జానకీ మందిర్ అన్నంతనే సీతమ్మకు ఏదో లింకు ఉంటుందని అనుకుంటారు.  

 పురాణాల ఆధారంగా సీతమ్మ పుట్టినది నేపాల్ ప్రాంతంలో జనక్ పూర్ అని...జనక మహారాజుకు సీత ఇక్కడే దొరికిందని ... ఆమె యుక్త వయసు వచ్చే వరకు ఈ ప్రాంతంలోనే తిరిగిందని చెబుతారు.    ఈ వాదనకు తగ్గట్లే ఇదే ప్రాంతంలో 1600 సంవత్సరంలో ఒక బంగారు విగ్రహం కూడా దొరికింది. ఈ ఆలయానికి సమీపంగా ఒక మండపం కూడా ఉంది..ఈ మండపంలోనే రాముడు సీత పెళ్లి జరిగింది అని కూడా అంటారు.

 1910లో ఈ గుడిని  రాణి వృషభాను ఈ ఆలయానికి ప్రాధాన్యతనిస్తూ భారీగా నిధులు ఖర్చు పెట్టి ఆలయానికి మార్పులు చేర్పులు చేశారు. తాజాగా మోడీ ఈ ఆలయంలో ప్రవేశించడంతో ఈ ఆలయానికి ప్రాధాన్యత సంతరించుకుంది...దీంతో మోడీ అడుగు ఈ ఆలయంలో పడటంతో పర్యాటకంగా కూడా అంతర్జాతీయ పరంగా మంచి గుర్తింపు వచ్చింది అని కొంతమంది అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: