పాపం సాయికుమార్..డిపాజిట్ గల్లంతు!

Edari Rama Krishna
కర్ణాటకలో ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి..ఉదయం ప్రారంభంమైన ఫలితాల్లో మొదట కాంగ్రెస్ జోరందుకుంది..ఆ తర్వాత బీజేపీ.. కాంగ్రెస్ జోరు తగ్గిస్తూ..ఒక్కొక్క స్థానాన్ని కైవసం చేసుకుంటూ వచ్చింది.  ప్రస్తుతం ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆదిక్యత కొనసాగిస్తుంది.  ఇదిలా ఉంటే.. డైలాగ్‌ కింగ్‌, బహుభాష నటుడు సాయికుమార్‌ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మరో సారి చిత్తుగా ఓడిపోయారు. 


తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే ఆంధ్రప్రదేశ్‌-కర్ణాటక సరిహద్దులోని బాగేపల్లి శాసన సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఆయన పోటి చేసిన విషయం తెలిసిందే. తెలుగు చిత్ర సీమలోనే కాకుండా కన్నడ సినీ పరిశ్రమలో సాయికుమార్‌కు మంచి క్రేజ్ ఉన్నదనే సంగతి తెలిసిందే. చాలా ఏళ్లుగా బీజేపీలో కొనసాగుతున్నారు. 


కర్ణాటక ఎన్నికల్లో తెలుగు ప్రజలు అత్యధికంగా నివసించే ఏపీ సరిహద్దులోని బాగేపల్లి శాసనసభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే సుబ్బారెడ్డి విజయానికి చేరువగా ఉండగా.. సీపీఎం, జేడీఎస్‌ అభ్యర్థులు రెండోస్థానంలో నిలిచారు. రాష్ట్రమంతా బీజేపీ హవా కొనసాగుతున్నా సాయికుమార్‌ మాత్రం నాలుగోస్థానంతో సరిపెట్టుకున్నాడు. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో సైతం సాయికుమార్‌ ఈ స్థానం నుంచే పోటీ చేసి ఓడిపోయారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: