మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్ష్ గ్రేషియా ఇవ్వాలి : కన్నా

Edari Rama Krishna
తూర్పుగోదావరి జిల్లా మంటూరు - పశ్చిమగోదావరి జిల్లా వాడపల్లి మధ్య నిన్న సాయంత్రం గోదావరి నదిలో లాంచీ మునిగిపోయిన  సంఘటనపై ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్ష్ గ్రేషియా ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేసారు. ఇటువంటి దుర్ఘటనలు చాలా బాధాకరమని,మృతుల కుటుంబాలకు తన సంతాపాన్ని తెలియజేస్తున్నాని అన్నారు.

ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ దుర్ఘటన చాలా బాధాకరమని, మృతుల కుటుంబాలకు తన సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు. ఈ సందర్భంగా పాతగుంటూరులో బాలికపై యువకుడు అత్యాచారానికి యత్నించిన ఘటనను ఖండించారు.

నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. మరోవైపు గుంటూరులో బాలికపై అత్యాచారయత్నం ఘటనను ఖండిస్తూ నిందితులను కఠినంగా శిక్షించానలి కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: