ఆయన మీద మర్డర్ కేస్ పెడతా - జగన్ వార్నింగ్

KSK
ఇటీవల బోటు ప్రమాద ఘటనలో చనిపోయిన 40మంది బాధితులను ఉద్దేశించి ప్రతిపక్షనేత వైసీపీ అధినేత జగన్ చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటికే ఇటువంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయి...అయినా కానీ ప్రభుత్వం కళ్ళు తెరవకపోవడం నిజంగా బాధాకరమని అన్నారు. ఘటనలో చనిపోయిన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండు చేశారు. గతంలో చంద్రబాబు పుష్కరాల సమయంలో పబ్లిసిటీ కోసం కొంతమందిని పొట్టన పెట్టుకోవడం కృష్ణాజిల్లా బోటు ప్రమాదం..తాజాగా ఇప్పుడు మళ్ళీ ఇటువంటి ఘటన జరగడం చంద్రబాబు నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.

ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా అసలు లైసెన్సులు లేని బోట్ లు ఇంకా నది లో తిరగటం ఏమిటని ప్రశ్నించారు. తమ ప్రబుత్వం అధికారంలోకి వస్తే బోట్ నడిపే వారికి అన్నివిధాలుగా అర్హతలు, ఇతర తనిఖీలు జరిపిన తరువాతనే లైసెన్స్ లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఐదురోజుల క్రితమే ఒక బోట్ కు అగ్నిప్రమాదం జరిగిందని అదృష్టంకొద్దీ ఆ ఘటనలో ఎవరికి ఎటువంటి హాని జరగలేదని, వెనువెంటనే ఈ దుర్ఘటన జరిగిందని అన్నారు.

ఇన్ని ఘటనలు జరుగుతున్నా చంద్రబాబు ఆలోచనావిధానంలో మార్పు రాలేదని అన్నారు..ప్రమాదం జరిగినప్పుడు మీడియా ముందు వచ్చి ముసలి కన్నీరు కార్చటం తర్వాత యధారాజా తధా ప్రజా అన్నట్టు వ్యవహరించడం చంద్రబాబుకి తగదు అని పేర్కొన్నారు.

ఇప్పటివరకు జరిగిన ప్రతి ప్రమాదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్లక్ష్యమేనని అన్నారు ఈ సందర్భంగా చంద్రబాబును జైల్లో పెట్టాలని కోరారు. ప్రస్తుతం జరిగిన ప్రమాదానికి ప్రభుత్వ బాధ్యత వహించాలని చనిపోయిన ప్రతి కుటుంబానికి పాతిక లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంకోసారి ఇటువంటి ఘటన పునరావృతమవుతే నేనే చంద్రబాబు మీద మర్డర్ కేస్ పెడతానుఅని వార్నింగ్ ఇచ్చారు జగన్.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: