కర్నాటక బీజేపీదేనని నాకు ముందే తెలుసు : పవన్ సంచలన ప్రకటన

Vasishta

జనసేనాని పవన్ కల్యాణ్ పోరాటయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 20వ తేదీన ఉత్తరాంధ్ర ప్రారంభించనున్న ఈ యాత్ర రాష్ట్రవ్యాప్తంగా కొనసాగనుంది. బస్సులో సాగనున్న ఈ యాత్ర ద్వారా ప్రజల్లో రాజకీయ జవాబుదారీతనంపై అవగాహన కల్పిస్తామని పవన్ కల్యాణ్ వెల్లడించారు. హార్స్ రైడింగ్ విషయంలో బీజేపీని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదన్నారు...


పవన్ కల్యాణ్ బస్సుయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 20వ తేదీ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాలనుకుంటున్న ఈ యాత్ర ఉత్తరాంధ్రలో 17 రోజులపాటు సాగేలా రూట్ మ్యాప్ రూపొందించారు. వేలాది మంది యువత, విద్యార్థులతో సాగనున్న ఈ యాత్ర ద్వారా ప్రజల్లో రాజకీయ జవాబుదారీతనంపై చైతన్యం తీసుకురానున్నట్టు పవన్ వెల్లడించారు. యాత్ర అనంతరం జిల్లా కేంద్రాల్లో లక్షమందితో నిరసన కవాతు చేపడతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సమస్యలను గుర్తించి, వాటిపై అధ్యయనం చేసి సమస్య పరిష్కార మార్గాలు కూడా సూచిస్తామన్నారు.


నాడు హామీ ఇచ్చినట్టిగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని పవన్ డిమాండ్ చేశారు. ప్రజల డిమాండ్లను పరిష్కరించే జవాబుదారీతనం కలిగిన విధంగా రాజకీయ పార్టీలు వ్యవహరించాలని ఆయన సూచించారు. పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉద్యమాల పురుటిగడ్డ అయిన ఉత్తరాంధ్ర వెనుకబాటు తనంపై ఇక్కడి నుంచే పోరాటం మెదలుపెడ్తున్నట్టు పవన్ ప్రకటించారు. గంగపూజ చేసిన తర్వాత ఇచ్చాపురం నుంచి యాత్ర మొదలవుతుందన్నారు. జైఆంధ్రా ఉద్యమంలో అసువులు బాసిన వారికి నివాళులు అర్పిస్తామన్నారు.


కర్నాటకలో హార్స్ రైడింగ్ పై పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అన్ని పార్టీలూ హార్స్ రైడింగ్ కు పాల్పడుతున్నప్పుడు ఒక్క బీజేపీనే ఇప్పుడు నిందించడం సరికాదన్నారు. కర్నాటకలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని తనకు ముందే తెలుసన్నారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా పాదయాత్ర సాగేలా జనసైన్యం ఏర్పాట్లు చేస్తోంది పవన్ బస చేసే ప్రతిచోటా సాదాసీదా ఏర్పాట్లు ఉండేలా పవన్ సూచనలు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: