తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల

Edari Rama Krishna
తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. సచివాలయంలోని డీ బ‍్లాక్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో 78.24 శాతం, అగ్రికల్చర్‌, ఫార్మసీలో 90.72 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 1,36,305మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1,06,646మంది పాసయ్యారు.

మే 25 నుంచి ఇంజినీరింగ్‌ తొలి విడత కౌన్సిలింగ్‌ ప్రారంభం అవుతుందని కడియం శ్రీహరి తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ, ఎంసెట్ ర్యాంకులను వివరాలను ప్రకటిస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా ఆయా విభాగాల్లో టాపర్ల వివరాలను వెల్లడించారు.

ఇంజనీరింగ్ విభాగంలో.. 
ఫస్టు ర్యాంక్ - వెంకటపాణి వంశీనాథ్ (రంగారెడ్డి), రెండో ర్యాంక్  -మైత్రేయ (రంగారెడ్డి), మూడో ర్యాంక్ - శ్రీవర్థన్ (రంగారెడ్డి), నాల్గో ర్యాంక్ - హేమంత్ కుమార్ (వైజాగ్), ఐదో ర్యాంక్ - మదన్ మోహన్ రెడ్డి ( కృష్ణాజిల్లా), ఆరో ర్యాంక్ - భరత్ (శ్రీకాకుళం)

అగ్రికల్చర్ విభాగంలో..
మొదటి ర్యాంక్ - నమ్రత (కర్నూలు) రెండో ర్యాంక్ - సంజీవ్ కుమార్ రెడ్డిమూడో ర్యాంక్ - ఆర్యన్ (నిజామాబాద్)నాల్గో ర్యాంక్ - సంజన (మేడ్చల్)



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: