కర్ణాటక :ఆనందంతో.. కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు..!

siri Madhukar
కర్ణాటకలో గత మూడు రోజులుగా ఎంతో ఉత్కంఠత నెలకొన్న విషయం తెలిసిందే.  మొన్న బీజేపీ అభ్యర్థి యడ్యూరప్ప సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా బీజేపీ, కర్ణాటక గవర్నర్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి.  104 సీట్లు గెలిచిన బీజేపీ అభ్యర్థి సీఎం ఎలా అవుతారని ప్రశ్నలు సంధించారు. 

ఓ వైపు కాంగ్రెస్, జేడీఎస్ ఏకమైన వేళ వారి సీట్లు 116 సీట్లు అవుతాయని ఏ విధంగా చూసినా ప్రభుత్వ  ఏర్పాటుకు అర్హులు అవుతారని..కానీ గవర్నర్ మాత్రం కేంద్రం చెప్పినట్లు వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వచ్చాయి.  తాజాగా జరిగిన పరిణామాలు నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్ప రాజీనామా చేయడంతో కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనే సంబరాలు చేసుకున్నారు.

సరిగ్గా 4 గంటలకు బలపరీక్ష జరగాల్సి ఉండగా... దీనికి కొద్ది క్షణాల ముందే యడ్యూరప్ప రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తనకు అవసరమైన సంఖ్యా బలాన్ని సాధించలేకపోయానని అంగీకరించారు.

కాంగ్రెస్ నేత డీకే శివకుమార్, జేడీఎస్ సీఎం అభ్యర్థి కుమార స్వామి పరస్పరం అభినందించుకుంటూ కనిపించారు. ఇద్దరూ చేతులు పైకెత్తి అసెంబ్లీ గ్యాలరీ వైపు చూస్తూ అభివాదం చేశారు. ఇరుపార్టీలకు చెందిన ఎమ్మెల్యేలంతా ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: