కర్ణాటక : అయ్యో పాపం..యెడ్యూరప్ప!

Edari Rama Krishna
అనుకున్నదొక్కటీ..అయ్యిందొక్కటీ..బొల్తా కొట్టిందేలే బుల్ బుల్ పిట్టా..! అన్నట్లు కర్ణాటక రాజకీయంలో యడ్యూరప్ప పరిస్థితి ఇలాగే తయారైంది. తన పదవికి సీఎం బీఎస్‌ యడ్యూరప్ప రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు అసెంబ్లీలో విశ్వాసపరీక్షకు ముందే ప్రకటన చేసి ట్విస్ట్ ఇచ్చారు. సభ వాయిదా పడిన యడ్యూరప్ప రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌కు రాజీనామా లేఖ సమర్పించారు.కేవలం మూడు రోజుల్లోనే.. అంటే 58 గంటల్లోనే యడ్యూరప్ప సీఎం పదవి నుంచి తప్పుకున్నారు.

మ్యాజిక్‌ ఫిగర్‌ చేరుకోలేకపోయామని గ్రహించిన యడ్యూరప్ప సభలో ఉద్వేగభరితంగా ప్రసంగించారు. కాగా, ఈ రోజు నాలుగు గంటల వరకు కర్ణాటకలో రాజకీయ పరిస్థితి ఎంతో ఉత్కంఠంగా కొనసాగింది.  ఓ వైపు కాంగ్రెస్,జేడీఎస్ ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీ ఫిరాయిస్తారా..బీజేపీ బుజ్జగింపులకు లొంగిపోయారా అన్నఅనుమానాలతో రక రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.  అంతే కాదు మొన్న హైదరాబాద్ కి ఎమ్మెల్యేలను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. 

సుప్రీమ్ కోర్టు ఆదేశాల మేరకు నేడు బల నీరూపణ చేయాల్సి ఉండగా..ఈ ఉదయానికి కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీలో హాజరయ్యేలా చూశారు.  మొత్తానికి బలనీరూపణలో యడ్యూరప్ప సఫలం కాకపోవడంతో రాజీనామా చేశారు.  మరోవైపు సీఎం రాజీనామాతో ప్రజాస్వామ్యం నెగ్గిందంటూ కాంగ్రెస్-జేడీఎస్‌ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.

ఇలాంటి ఛేదు అనుభవం యడ్యూరప్పకు గతంలో కూడా జరిగింది. 2007లో నవంబర్‌ 12న సీఎంగా బాధ్యతలు చేపట్టిన యడ్యూరప్ప కేవలం 8 రోజులపాటు పదవిలో కొనసాగి అదే నెల 19న రాజీనామా చేశారు. 2006 ఫిబ్రవరి 3న సీఎం అయిన యడ్యూరప్ప 2007 అక్టోబర్‌ 9న పదవి నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: