తర్కం ముగిసిన చోటే మాయ మొదలు - కాంగ్రెస్ కు మిగిలింది "జెడిఎస్ వెసే ముష్టే"

తర్కం ముగిసిన చోటే మాయ మొదలు అవుతుంది ఇదే ఇంగ్లిష్ ప్రోవెర్బ్ వేర్ లాజిక్ ఎండ్స్, దేర్ మాజిక్ బిగిన్స్ గా మనకు సుపరిచితం. వ్రతం చెడ్డా ఫలితం దక్క లేదు అనిపిస్తుంది కాంగ్రెసుకు. భారతీయ జనతా పార్టీని కర్ణాటక రాజ్య పీఠిపై కూర్చోకుండా చేయాలన్న ఒక దుగ్ధ చివరకు కాంగ్రెస్ ను జెడిఎస్ పాద పద్మాల చెంతకు చేర్చింది. 78శాసనసభ స్థానాల్లో విజయం పొందిన ఔన్నత్యం 38శాసనసభ స్థానాలు మాత్రమే గెలిచిన జెడిఎస్ లాంటి చిన పార్టీ కి దాసోహం చేసింది. 

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా తరువాత, ఆ అధికార పీఠాన్ని అధిరోహించేందుకు జేడీఎస్ నేత కుమారస్వామి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శనివారం కర్ణాటక నాటకీయ పరిణామాల మధ్య యడ్డీ తన పదవికి రాజీనామా చేసిన దరిమిలా, గవర్నర్ ఆదేశం మేరకు కుమారస్వామి సీఎంగా మే 23న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

కర్నాటకం.. పదవుల పంపకంపై ప్రతిష్టంభన?

బలపరీక్షకు ముందే రాజీనామా చేసిన యడ్యూరప్ప, సీఎంగా కొనసాగాలన్న లక్ష్యాన్ని సాధించలేకపోయారు. తగి నంత సంఖ్యాబలం లేని బీజేపీ తమ ఎమ్మెల్యేలను ఆకర్షించడానికి ప్రలోభాలకు గురిచేస్తోందని విరుచుకుపడి, చివరివరకు పోరాడిన కాంగ్రెస్-జేడీఎస్ కూటమికే అంతిమంగా అధికారం దక్కింది. ప్రస్తుతం మంత్రివర్గ కూర్పుపై కుమారస్వామి కసరత్తు ప్రారంభించారు. 

కాంగ్రెస్ పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు మరో 20మంత్రి పదవులను ఇవ్వాలని కుమారస్వామి  నిర్ణయించు కున్నట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ సీనియర్ నేత, కర్ణాటక పీసీసీ చీఫ్ పరమేశ్వర కు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇవ్వడానికి కుమారస్వామి అయిష్టంగా ఉన్నారని సమాచారం. అలాగే కీలకమైన హోం-శాఖ కూడా కాంగ్రెస్‌ కు యివ్వటానికి జేడీఎస్ నిరాకరిస్తోందని అభిజ్ఞవర్గాల కథనం. దీనిపై కుమారస్వామితో కాంగ్రెస్ సీనియర్ నేతలు చర్చించనున్నారు. ఆర్థికశాఖ బాధ్యతలను సైతం కుమారస్వామే నిర్వహిస్తారని వార్తలు వెలువడుతున్నాయి.

78స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పరిస్థితి ఉప ముఖ్యమంత్రి వరకే పదవికే పరిమితం. హోంమంత్రి పదవికి, ఆఖరకు ఆర్ధిక మంత్రి పదవికి నోచు కోకపోవటం అంత దుస్థితి హీన స్థితి శత్రువుకు కూడా పట్టకూడదని అటున్నారు. 

శనిని తప్పించుకోవటానికి చెట్టుతొర్రలో అది కూడా తన పర్వదినం (శివరాత్రి) నాడు దాగిన శివుడు, దాన్నే శనిపట్టటం అంటారు  


మొత్తం 30 మంది మంత్రులతో కలసి ప్రమాణ స్వీకారం చేయనున్న కుమారస్వామి, ఆ తరువాత వీలును బట్టి మంత్రివర్గాన్ని విస్తరించాలన్న ఆలోచనలో ఉన్నట్టు జేడీఎస్ వర్గాలు వెల్లడించాయి. తమకు మద్దతుగా నిలిచిన ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యే లకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలని కుమారస్వామి భావిస్తున్నారట. 
ఇక కాంగ్రెస్ నుంచి మంత్రి వర్గంలోకి ఎవరిని సిఫార్సు చేయాలన్న విషయమై నేడు ఢిల్లీలో అధ్యక్షుడు రాహుల్ గాంధీ, అశోక్ గెహ్లాట్, గులాం నబీ ఆజాద్ తదితరులతో కర్ణాటక నేతలు భేటీకానున్నారు. 

ఇక కాంగ్రెస్ కు మిగిలింది జెడిఎస్ వెసే ముష్టే! మొత్తం జెడిఎస్ కి  వైభవం కాంగ్రెస్ తో వస్తే, బిజెపి పై కక్ష తో  కాంగ్రెస్ దరిద్రాన్ని తెచ్చుకుంది.  పరమ శివునికే శని పడితే దాని ప్రభావం నుండి తప్పించుకోలేక పోయారు. ఇక కాంగ్రెస్ కు జెడిఎస్ రూపంలో శని పట్టి  పాతాళానికి తీసుకుపోవటం తథ్యం. అందుకే కామ క్రొధ మధ మోహ లోభ మాత్సర్యాలను వదిలెయ్యాలని పెద్దలు చెప్పారు. 

కాంగ్రెస్ కున్న మాత్సర్యం (అసూయ) వారి ఔన్నత్యాన్ని చివరకు 38మార్కులే తెచ్చుకున్న వాడి పాదాల చెంతకు చేర్చింది. ఇది ఒక రకంగా బిజెపి కి విజయమే.  
మెజారిటీ సభ్యుల ప్రభుత్వం ఏర్పడాల్సిన చోట శనిపట్టిన రాష్ట్రానికి మైనారిటి సభ్యుల కుహనా ప్రభుత్వ పాలన దొరికింది. ఇదేనా ప్రజాస్వామ్యం? అది ఉంటే ఎంత ఊడితే ఎంత? అంటున్నారు కర్నాటక ప్రజలు. అయితే వారు కోరని ప్రభుత్వాన్ని వారినెత్తికెక్కించిన కాంగ్రెస్ ను 2019 లో చూసుకుంటామని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: