నారా చంద్రుని పుత్రోత్సాహం....


పుత్రొత్సాహం తండ్రికి 
పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనులా 
పుత్రుని కనుగొని పొగడగా
పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ! 

అన్నట్లు.... ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర, ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ కు "బిజినెస్‌ వరల్డ్‌ మ్యాగజైన్‌" "డిజిటల్‌ లీడర్‌ ఆఫ్‌ ది ఇయర్‌" పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్, రాజస్థాన్ పరిశ్రమలశాఖ మంత్రి రాజ్‌గోపాల్ సింగ్ షెఖావత్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకున్నారు. 

టెక్నాలజీని వినియోగించు కోవడం ద్వారా సమర్థవంతమైన పరిపాలన అందిస్తున్న వ్యక్తులకు ఈ అవార్డును ప్రకటిస్తారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తున్న టెక్నాలజీ, డ్యాష్ బోర్డ్ ఏర్పాటు తదితరాల ఆధారంగా ఈ అవార్డులను ప్రకటించారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభి వృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల్లో అధునాతన సాంకేతికత, సాధించిన ఫలితాల ఆధారంగా నారా లోకేష్‌కు ఈ అవార్డు దక్కింది. అలాగే రాష్ట్రంలో జలవాణి, గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా కోసం వినియోగిస్తున్న అధునాత ట్రాకింగ్‌ సిస్టమ్‌కు మరో అవార్డు లభించింది. 

No Politics please,  only Business

వివిధ ప్రభుత్వ కార్యక్రమాల్లో టెక్నాలజీని వినియోగించుకుంటూ సాధించిన అత్యుత్తమ ఫలితాల ఆధారంగా నారా లోకేష్ కు ఈ అవార్డును ప్రకటించామని "బిజెసెన్ వర్డల్డ్ పత్రిక" స్పష్టం చేసింది. మరో వైపు, మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఏడాది లోపే నారా లోకేష్ కు ప్రతిష్టాత్మక అవార్డు రావడం పట్ల చంద్రబాబు  అత్యంత ఆనందంగా, గర్వంగా ఉన్నారని టీడీపీ వర్గాలు అంటున్నాయి. దేశంలో, పరిపాలనకు సంబంధించిన అంశాల్లో టెక్నాలజీ యొక్క అవసరాన్ని గుర్తించి, టెక్నాలజీని వాడటం మొదలుపెట్టిన  తొలి రాజకీయ నాయకుడు  తానేనని,  తనను చూసిన తర్వాతే దేశంలో మిగతా నాయకులు టెక్నాలజీ ఆవశ్యకతను గుర్తించారని చంద్రబాబు నిన్న తనను కలిసిన పార్టీ ప్రముఖల దగ్గర  వ్యాఖ్యానించినట్లు తెలిసింది. 


తాజాగా, తన బాటలోనే తన కుమారుడు కూడా వెళుతుండటం తనకు ఆనందాన్ని కలిగిస్తుందని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. పాలనాపరమైన అంశాల్లో లోకేష్‌, ముందు చూపు, చొరవ, దూకుడు చూస్తుంటే భవిష్యత్తులో తనను మించిన నాయకుడు అవుతాడనే నమ్మకం తనకు ప్రగాఢంగా ఉందని ఆయన తన పార్టీ నాయకుల దగ్గర నారా లోకేష్ ను అభినందించారట. మరోవైపు, తమ యువరాజుకు ప్రతిష్టాత్మక అవార్డు తెలుగు తమ్ముళ్లు కూడా ఉత్సాహంతో పొంగిపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: