కర్ణాటకలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి : అమిత్ షా

Edari Rama Krishna
ఈ మద్య యావత్ భారత దేశంలో పెను సంచలనాలు సృష్టించింది కర్ణాటక రాజకీయం.  మూడు రోజుల పాటు ఎంతో ఉత్కంఠ రేపిన కర్ణాటక రాజకీయం మొత్తానికి యడ్యూరప్ప రాజీనామాతో ముగింపు పలికింది.  ఈ నెల 12 పోలింగ్ జరిగింది..15న ఫలితాలు వెలువడ్డాయి.  బీజేపీ 104, కాంగ్రెస్ 77, జేడీఎస్ కి 38 ఇతరులు 2 గెల్చుకున్నారు.  తమకు భారీ మెజార్టీ వచ్చిందని బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధం కాగా..వెంటనే కాంగ్రెస్, జేడీఎస్ పొత్త పెట్టుకొని తమకే ఎక్కువ సీట్లు ఉన్నాయని..తామే ప్రభుత్వ ఏర్సాటు చేస్తామని గవర్నర్ కి వినతి పత్రం ఇచ్చారు.

కానీ నాటకీయ పరిణామాల మద్య యడ్యూరప్ప సీఎం అయ్యారు.  కానీ మొన్న బలనిరూపణ లేక పోవడంతో రాజీనామా చేయాల్సి వచ్చింది.  ప్రస్తుతం కర్ణాటక సీఎం గా కుమార స్వామి ఎన్నికవుతారని వార్తలు వస్తున్నాయి.  ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ హద్దులు దాటి ప్రవర్తించిందని, తమ పార్టీపై అసత్య ప్రచారాలు చేసిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు.  అయినప్పటికీ తమ పార్టీకే ప్రజలు మద్దతు తెలిపారని చెప్పారు.

ఈ రోజు న్యూ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కర్ణాటకలో తమ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని, అందుకు కృషి చేసిన తమ పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.ఎన్నికల ముందు 122 సీట్లున్న కాంగ్రెస్‌ పార్టీ సీట్లు 78కి పడిపోయాయని, మరోవైపు ఆ పార్టీ సంబరాలు చేసుకుంటోందని ఎద్దేవా చేశారు.

జేడీఎస్‌కి కూడా కేవలం 37 సీట్లే వచ్చాయని, తక్కువ సీట్లు వచ్చినందుకే ఆయా పార్టీలు వేడుకలు చేసుకుంటున్నాయా? అని ప్రశ్నించారు. ప్రజా తీర్పుకు భిన్నంగా కాంగ్రెస్-జేడీఎస్ అపవిత్ర కూటమి ఏర్పాటు చేసి  ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటోందని అన్నారు



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: