విజృంభిస్తున్న నిపా వైరస్..పన్నెండుకు చేరిన మృతులు!

Edari Rama Krishna
గబ్బిలాలు, పందులు తదితర జంతువుల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వైరస్ నిపా కేరళను వణికిస్తున్నది. ఈ వైరస్ ఇప్పటికే తొమ్మిదిమందిని పొట్టనబెట్టుకుంది. ముగ్గురు వ్యాధిగ్రస్థులకు చికిత్స అందించిన నర్సింగ్ అసిస్టెంట్ లినీ(31) కూడా సోమవారం ఉదయం మృతిచెందారు. మృతుల సంఖ్య మరింత పెరుగవచ్చని తాజా నివేదికల ద్వారా తెలుస్తున్నది. ప్రాణాంతక వైరస్ నిపా కేరళను వణికిస్తున్నది.  మృతుల సంఖ్య మరింత పెరుగవచ్చని తాజా నివేదికల ద్వారా తెలుస్తున్నది. మరో 20మందిలో ఈ వ్యాధి లక్షణాలను గుర్తించారు.  మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. ఇదే కుటుంబంలోని మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధితులందరికీ ఐసీయూల్లో చికిత్సలు అందిస్తున్నారు.

నిపా వైరస్‌ దక్షిణ భారత దేశంలో కనిపించడం ఇదే తొలిసారి. దీంతో ఈ ప్రాణాంతక వైరస్‌ పట్ల కేరళతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కేరళలోని కోజికోడ్‌ తదితర ప్రాంతాల్లో 23 మంది నిపా వైరస్‌ బాధితులు వివిధ వైద్యశాలల్లో చికిత్స పొందుతున్నారు.వ్యాధి లక్షణాలు వైద్యులకు అంతుపట్టకపోవంతో రోగుల నుంచి రక్తనమూనాలు సేకరించి వ్యాధినిర్ధారణ కోసం పుణెలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీకి పంపారు. అక్కడ జరిపిన పరీక్షల్లో నిపా వైరస్‌ ఉన్నట్లు నిర్ధారించారు. హై అలర్ట్ ప్రకటించడంతోపాటు.. ఇన్ఫెక్షన్ సోకిన జిల్లాలకు కేంద్ర ఆరోగ్య శాఖ వైద్య నిపుణులను పంపింది.

వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేరళ సర్కారు అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. నిపా వైరస్ జంతువులు, మనుషుల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకుతోంది. ముఖ్యంగా గబ్బిళాలు, పందుల ద్వారా ఇది వేగంగా విస్తరిస్తోంది. తొలిసారిగా నిపా వైరస్‌ను 1998లో మలేసియాలో గుర్తించారు. వైరస్ బారిన పడిన గబ్బిలాలు పండ్లను తిని గింజలను వదిలిస్తే.. వాటిని తిన్న పెంపుడు జంతువులకు కూడా ఈ వ్యాధి సోకుతుంది. ఈ జంతువుల నుంచి వైరస్ మనుషులకు వ్యాపిస్తోంది. నిపా వైరస్ పొదుగుడు కాలం 5 నుంచి 14 రోజులు.

ఈ వైరస్ బారిన పడిన వారిలో జ్వరం, తలనొప్పి, మగతగా ఉండటం, మానసిక గందరగోళం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన 24 నుంచి 48 గంటల్లోగా రోగి కోమాలోకి వెళ్లే అవకాశం ఉంది. ఈ వ్యాధికి గురైన వారికి ఎప్పటికప్పుడు చికిత్స అందిస్తూ.. వ్యాధి వ్యాప్తి చెందకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం డాక్టర్ల బృందానికి సూచించింది. కాగా, గత రెండు వారాలుగా ఈ వైరస్ కేరళను భయపెడుతోంది. దీని బారినపడి కోళికోడ్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నిన్న మృతి చెందారు. వైరస్ బాధితులకు చికిత్స అందిస్తున్న ఒక నర్స్ కూడా మృతి చెందింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: