గ్యాంగ్ లీడర్ లా ఫీల్ అవుతున్న బాబు.., సూసు మాస్టర్ !

KSK
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బిజెపి పార్టీ పై ఎప్పటి నుండో ఆగ్రహంతో ఉన్నారని మనకందరికీ తెలుసు. ముఖ్యంగా గత ఎన్నికలలో ఇచ్చిన హామీల లో ఎది కూడా నెరవేర్చకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేశారని చంద్రబాబు ఇటీవల జరుగుతున్న సభలలోను మీడియా సమావేశాలలోనే తన బాధ చెప్పుకుంటున్నారు. అయితే మరోపక్క ప్రతిపక్ష పార్టీలు కూడా చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు హామీలను...గురించి ప్రస్తావన తేస్తున్నారు.

దీనికి మాత్రం చంద్రబాబు నుండి గాని తెలుగుదేశం పార్టీ నుండి గాని ఎటువంటి స్పందన రావడం లేదు. ఇదిలావుండగా చంద్రబాబు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను కూడగట్టే ప్రయత్నంలో నిమగ్నం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపద్యంలోనే చంద్రబాబు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఇటీవల సన్నిహితంగా ఉంటున్నారు ..ఇందులోభాగంగానే తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను చంద్రబాబు కలిసారు.

కర్ణాటక జేడీఎస్ నేత కుమారస్వామి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి హాజరైన కేజ్రీవాల్ తో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీజేపీ పాలన గురించి చర్చలు జరిపి లోకల్ పార్టీలన్నీ ఏకమవ్వాలని ఆయనతో చర్చలు జరిపారు. స్థానిక పార్టీలపై బీజేపీ పెత్తనం చెలాయిస్తోందని వారు చెప్పిన విధానాలకు లొంగకుంటే వివాద రకాలుగా విమర్శలు చేస్తోందని చంద్రబాబు మాట్లాడారు.

అయితే చంద్రబాబు కేజ్రీవాల్ అనే కాకుండా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా కలుపుకొని ఒక కూటమిగా వెళ్లాలని ఆలోచిస్తున్నారు. ఇదంతా గమనిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు చంద్రబాబు గ్యాంగ్ లీడర్ లా ఫీల్ అవ్వుతున్నరాన్ని అంటున్నారు...అంతేకాకుండా ఓటుకు నోటు కేసు...మరొకసారి బయటకు తీస్తే దేశంలో వ్యతిరేకంగా బీజేపీకి కూడగడుతున్న పార్టీల దగ్గర కాదు కదా...వెళ్లి ఢిల్లీ బిజెపి పెద్దల దగ్గర చేతులు కట్టుకుని నిలబడతాడని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: