కేసీఆర్ నిర్ణయాన్ని బాబు ఏపీలో అమలు చేస్తాడా...!

Prathap Kaluva

కేసీఆర్ తీసుకువచ్చిన జోన్ ల విధానం అందరు హర్షించ దగినిది. తెలంగాణ లో వెనుక బడిన ప్రాంతాలన్నిటిని ఒక గాడిన కట్ట కుండా ప్రాంతీయ అసమానతలు తగ్గించడానికి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అయితే ఆంధ్ర ప్రదేశ్లో కూడా ఈ టీడిపి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంటారా లేదా అన్నది డౌట్..! అయితే టీడీపీ సర్కార్ రాష్ట్రం చిన్నది కాబట్టి ఒకే జోన్ గా చేయాలని ప్రయత్నిస్తుంది. 


తాజాగా కేసీఆర్ రెండుజోన్లుగా ఉన్న తెలంగాణ రాష్ట్ర పరిధిని తాజాగా ఏడు జోన్లుగా విభజించారు. కడియం శ్రీహరి ఆధ్వర్యంలో వేసిన కమిటీ ఆరు జోన్లను ప్రతిపాదించినప్పటికీ.. అది కూడా లోపభూయిష్టంగానే ఉన్నదని భావించిన కేసీఆర్.. తాను సొంతంగా తెలంగాణ మేధావులు, మాజీ అధికారులు, నిపుణులతో పలు విడతలుగా చర్చలు సాగించి.. మొత్తం ఏడు జోన్లుగా పునర్విభజన చేశారు.


దీని వల్ల.. వెనుకబడిన ప్రాంతాల వారికి ఖచ్చితంగా మేలు జరుగుతుంది. ప్రాంతీయ అసమానతల కారణంగా ఏ ఒక్కరూ కూడా అవకాశాలు కోల్పోయే పరిస్థితి లేకుండా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. అదే సమయంలో ఏపీ సంగతి ఏమిటి? ప్రభుత్వం ఇంకా రాష్ట్రాన్ని ఒకటే జోన్ గా చేసేయాలనే కుట్రపూరిత ఆలోచనతోనే ఉన్నదా అనేది ప్రశ్న.  ఎందుకంటే.. జోన్ల విషయంలో ఇదమిత్థంగా నిర్ణయం తీసుకున్నట్లుగా ఏపీ సర్కారు వెల్లడించలేదు. ఒకే జోన్ గా ఉంటే మాత్రం ప్రజలకు చాలా నష్టం జరగడం ఖరారు. మరి కేసీఆర్ ఫార్ములా బాబు ఫాలో అవుతాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: