చంద్ర బాబు ఎన్నికలు దగ్గర పడటం తో వరాలు అప్పుడే మొదలుపెట్టాడా...!

Prathap Kaluva

చంద్ర బాబు కు ఎన్నికల సమయం లో వరాలు కురిపించడం కొత్తేమి కాదు. ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇవ్వడం చంద్ర బాబుకే చెల్లింది. 2014 లో ఇచ్చిన ఎన్నికల హామీలు అందరికి గుర్తే ఉంటాయి. వాటిల్లో ఇప్పటికి ఎన్ని అమలు చేసాడో ప్రజలకు వేరే చెప్పాల్సిన పని లేదు. అయితే 2019 లో ఎన్నికలు సమీపిస్తుండటం తో బాబు హామీలు మొదలు పెట్టాడు. డీజిల్ ధరలు పెరిగిన బస్సు చార్జీలు పెంచమని అధికారుల చేత ప్రకటనలు ఇప్పిస్తున్నారు. 


గత సార్వత్రిక ఎన్నికల సమయంలో తనను అధికారంలోకి మోసుకువచ్చి కూర్చోబెట్టిన బోయీలు మోడీ గానీ, పవన్ కల్యాణ్ గానీ ఈసారి అందుబాటులో లేరని చంద్రబాబుకు బాగా తెలుసు. డైరక్టుగా ప్రజలనే బురిడీ కొట్టించడం మినహా రెండో మార్గం లేదని ఆయనకు తెలుసు. అందుకే ప్రజలను సామూహికంగా ఆకర్షించే మంత్రాలను ఆయన ప్రయోగిస్తున్నారు. అందులో భాగంగానే విద్యుత్తు, ఆర్టీసీ చార్జీలు పెంచడం లేదనే మాటలు అధికారుల ద్వారా చెప్పిస్తున్నారు. తద్వారా ప్రజల అభిమానాన్ని కూడగట్టుకోవచ్చునని వారు ఆశిస్తుండవచ్చు.


ఇప్పటికే మన రాష్ట్రం మిగులు విద్యుత్తుకలిగి ఉన్న రాష్ట్రంగా ముద్ర పడింది. విద్యుత్తును భారీగా ఇతర రాష్ట్రాలకు విక్రయిస్తున్నారు. నిజానికి ఇంత అధిక విద్యుదుత్పాదన ఉన్నప్పుడు.. ఇతర రాష్ట్రాలకు విక్రయించే విద్యుత్తు ధరలు కాస్త పెంచుకుని.. రాష్ట్ర ప్రజలకు విద్యుత్తు ఛార్జీలను నామమాత్రంగానైనా తగ్గిస్తే అది ప్రభుత్వపు ప్రతిభ అవుతుంది. కానీ అలాకాకుండా.. పెంచం అనేదే పెద్దవరం కింద ప్రభుత్వం చెప్పుకుంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: