కర్ణాటక సిఎం కుమారస్వామి మనశ్శాంతికి ఇప్పట్నుంచి "నో గ్యారెంటీ" -ఇది 100% నిజం

కేవలం ఏడు అడుగు దూరంలో అంటే "సప్తపది  అధికారకళ్యాణం"  కోల్పోయిన యడ్యూరప్ప, ఒక రకంగా కుమారస్వామిని వేటాడనున్నారని ఆయన్ను ఇక నిద్రపోనివ్వరని అంటున్నారు. యడ్యూరప్ప, కుమారస్వామి ప్రమాణ స్వీకారక్షణం  నుంచే తన దూకుడు పెంచారు.  కుమారస్వామి తాను ఎన్నికలప్పుడు చేసిన రుణ మాఫీ పై స్పష్టత ఇవ్వకుంటే సోమవారం కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చారు యడ్యూరప్ప.

ఎన్నికల మ్యానిఫేస్టోలో అన్ని పార్టీలు తమ హామీలను ప్రజల ముందుంచాయి. కాంగ్రెస్, జేడీఎస్, బీజేపీలు విడివిడిగా తమ ఎన్నికల ప్రణాళికలను పోలింగ్ కు ముందే ప్రకటించాయి. అందులో అందరూ ప్రకటించిందే ఋణమాఫీ. ఈ ఋణమాఫీ అంశం ఇప్పుడు కర్ణాటకలో యడ్యూరప్పకు త్రిశూలంగా మారింది. అసలు ఋణ మాఫీపై యడ్డీ ఎంత బలంగా సంకల్పం చేసుకున్నారంటే ఈ నెల17వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, రైతు ఋణమాఫీ దస్త్రంపై తొలి సంతకం చేయడానికి సమాయత్తమైనారు. 

అయితే సుప్రీంకోర్టు నుంచి ఝలక్ ఉత్తర్వులు రావడం, బలనిరూపణ కు సిద్ధమవ్వడం, బలనిరూపణకు ముందే బయటకు వచ్చేయడంతో ఆయన  ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. తర్వాత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. శాసనసభ సమావేశాల్లో రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని యడ్యూరప్ప చాలా ఘట్టిగా డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రేస్-జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో ఋణమాఫీని అమలు చేయడం సాధ్యంకాదు అన్నది యడ్యూరప్ప ఆలోచన.  వ్యూహం తోనే  కుమారస్వామి ప్రభుత్వ పాలన ప్రారంభమైన మొదటి రోజే యడ్యూరప్ప ప్రభుత్వంపై దాడి  ప్రారంభించారు. ఈ నెల 25వ తేదీలోగా రుణమాఫీపై స్పష్టమైన ప్రకటన కుమారస్వామి చేయకుంటే 28వ తేదీన అంటే రేపు సోమవారం కర్ణాటక బంద్ చేస్తామని యడ్యూరప్ప వెల్లడించారు. 

అయితే కుమారస్వామి తన అధికారపీఠిపై ఇంకా సరిగా కూర్చోనేలేదు. బహుశ ఇది అధికార పీఠం కాదు, ముళ్ళ పీఠంగా ఋజువు చేయ్యలనుకున్నారేమో, యడ్డీ తన దైన  మొండి విధానశైలితో దాడి ప్రారంభించటం కుమారస్వామికి గడ్డుకాలమొచ్చినట్లే అనిపిస్తుంది.  మంత్రివర్గం కూడా ఏర్పాటు కాకుండానే యెడ్డీ దెబ్బకు తల్లడిల్లి పోతు న్నారు కుమారస్వామి. మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ పెద్దలతో చర్చించడానికి ఢిల్లీ వెళ్లారు. అవన్నీ సర్దుబాటు అయ్యేసరికి మరో రెండు, మూడు రోజులు పట్టే అవకాశం ఉంటుంది.

కాని ఈ లోగానే కుమారస్వామిపై వత్తిడి తేవడమేంటన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అయితే కుమారస్వామిపై కర్ణాటకలొ ఎవరికి సానుభూతి లేదు. 38సీట్ల తో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన మొద్దబ్బాయి పాలన తాడు బొంగరం లేనిదిలా ఉంటుందన్నది అందరికే తెలిసిందే. అందులో కాంగ్రెస్ మొగుడు అంటే ఆ కాపురం ఎలా తగలడ్డుద్దో అందరికి తెలిసిందే. ఇక్కడ రాష్ట్రంలో అసంతృప్తులకు కొదవేలేదు. అక్కడ డిల్లీలో మాతా, పుత్రుల వత్తిడి. కారణం వారి పాలన పరోక్షంగానైనా ఉన్న పెద్ద రాష్ట్రం కర్ణాటకే కదా! 

వీటికి తోడు అత్యధిక సీట్లు గెలుచుకొని పిచ్చోడులా కూర్చోవటం బిజెపి లంటి రంకుమొగుడికి కుదురుతుందా! అందునా అటు కుల పరంగా, రాజకీయపరంగా యడ్డీ కి కుమారస్వామి ఆయన కుటుంబం మొత్తం ఆగర్భశత్రువులే. రాజకీయాల్లోచాన్స్  దొరికితే రాయల్ హంటే కదా! 

అయితే యెడ్డి పట్టుకున్న ఆయుధం రైతు ఋణ మాఫీ అనే బలమైన త్రిశూలం.  కర్ణాటకలో ఋణ మాఫీ చేస్తే మొత్తం యాభై మూడు వేల కోట్ల రూపాయల భారం రాష్ట్ర ఖజానాపై పడుతుంది. కుమారస్వామి తన ఎన్నికల ప్రణాళికలో రుణమాఫీ చేస్తామని స్పష్టం చెప్పారు. అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రుణమాఫీ చేస్తానని కుమారస్వామి చెప్పడంతో  ఇప్పుడు యడ్యూరప్పకు ఆ వాగ్ధానం ఆయుధంగా చిక్కింది.  అయితే సంకీర్ణ ప్రభుత్వంలో అంత పెద్ద నిర్ణయాన్ని కుమారస్వామి ఒక్కరే తీసుకోవటం అసంభవం అన్నది యడ్యూరప్పకు తెలియంది కాదు. 

కుమారస్వామిని పై వత్తిడి తేచ్చి చెడుగుడు ఆడుకోవటమే ఆయన వ్యూహం. యడ్యూరప్ప గంటల్లోనే డెడ్-లైన్ విధించడం కూడా సరికాదన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నా, అది కుమారస్వామి స్వయంగా అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో ఋణ మాఫీ చెస్తానని ప్రజలకు చేసిన వాగ్ధానమే కదా!  ఇక కుమారస్వామికి మనశ్శాంతికి గ్యారంటీ లేదు. ఇది నిజం!! 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: