సీనియర్ ఎన్టీఆర్ కంటే పవన్ - బాబు వెన్నుపోటు పెద్దది

KSK
ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యల కోసం నిరాహార దీక్ష చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దీక్ష ఆంధ్రరాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించాయి. శ్రీకాకుళం జిల్లా ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగిన ఈ దీక్షలో జనసేన పార్టీ కార్యకర్తలు చాలామంది పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఈ ఒక్క రోజు దీక్షలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మనస్తత్వం ఆదినుండి వెన్నుపోటు తత్వమని అన్నారు పవన్. ఉద్దానం సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేయాలని కోరుతున్నట్లు పేర్కొన్న పవన్ ఏపీ సీఎం పేరును ప్రస్తావించకుండా వెన్నుపోటు వ్యాఖ్యలు చేశారు.


20 వేలమంది ఉద్దానం కిడ్నీ పేషంట్లు ఉంటే కనీస వైద్య సదుపాయాలు కలిగించకుండ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని ఆరోపించారు. వేల కోట్లు ఖర్చుపెట్టి దీక్షలు విమాన ప్రయాణాలు చేస్తున్న ప్రభుత్వానికి మనుషుల ప్రాణాలు లెక్క ఉండదా అంటూ చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏకిపారేశాడు పవన్. తాము అడుగుతున్న డిమాండ్లు సరైనవే అని వాటికి పెద్ద ఖర్చు కూడా ఉండదంటూ పవన్ అన్నారు.


తాము నిర్దిష్టమైన డిమాండ్లు చేస్తే తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కళ్లు తెరిచి నిధులు-పెన్షన్-బస్సు సదుపాయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి మండలానికి డయాలసిస్ సెంటర్లు పెంచాలిబ్లడ్ బ్యాంక్ లు కూడా పెంచాలని డిమాండ్ చేశారు. వేల వేల కోట్లు ఖర్చుపెట్టి ఆడంబరాలు చేసే చంద్రబాబు ప్రభుత్వం ఉద్దానం బాధితుల కోసం ఖర్చు పెట్టలేరా అంటూ పవన్ ప్రశ్నించారు. అయితే రాజకీయ గుర్తింపుకోసం దీక్ష చేస్తున్న అన్న చంద్రబాబు కామెంట్లపై పవన్ కళ్యాణ్ తీవ్రంగా ప్రతిస్పందించారు.


నిజంగా రాజకీయ గుర్తింపు కోసం నేను తహతహలాడితే వెన్నుపోటు పొడిచే మీలాంటి వాళ్లకు గత ఎన్నికలలో ఎందుకు మద్దతు తెలుపుతాను..అని అన్నారు. నిజంగా గత ఎన్నికలలో ఇప్పటి ప్రభుత్వానికి మద్దతు తెలిపి రామారావు కంటే గట్టిగా వెన్ను పోటు పొడిపించుకున్న అని అన్నారు పవన్ కళ్యాణ్. మొత్తంమీద పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి అనవసరంగా మద్దతు ఇచ్చారని పశ్చాత్తాప పడుతున్నారు. అంతేకాకుండా ఉద్దానం కిడ్నీ సమస్యలపై ప్రభుత్వం శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలని అన్నారు పవన్. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: