జగన్ కేసుల పై సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ సిబిఐ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ

KSK
మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ జగన్ అక్రమాస్తుల కేసు పై సంచలన వ్యాఖ్యలు చేశారు . తాజాగా ఇటీవల ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ అక్రమాస్తుల కేసు గురించి మీడియా ప్రతినిధి ప్రశ్నించగా ...ఆ ప్రశ్నలకు సరైన రీతిలో సమాధానం చెప్పారు. తాము నిబంధనల ప్రకారం వ్యవహరించి, పై అధికారుల నుంచి అనుమతి తీసుకున్న తరువాతనే ఆనాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశామని, ఆపై 24 గంటల వ్యవధిలోనే కోర్టు ముందు హాజరు పరిచామని వెల్ల‌డించారు.

కోర్టు తమ చర్యలను రివ్యూ చేసి, అవి సరైనవేనని నిర్ధారించిందని ఆయ‌న తెలిపారు. తాను 2006లోనే హైదరాబాద్ సీబీఐ ఆఫీసుకి బదిలీపై వచ్చానని, ఆపై 5 సంవత్సరాల తరువాత 2011లో కేసు తన ముందుకు వచ్చిందని తెలిపారు. ప్రత్యేకంగా జగన్ను అరెస్టు చేయించడానికి నన్ను ఈ కేసు కోసం నియమించలేదని తనపై ఎటువంటి రాజకీయం ఒత్తిడి లేవని పేర్కొన్నారు.

అంతేకాకుండా ఉన్న సమాచారాన్ని బట్టే విచారణ చేశామని నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడా కూడా ప్రవర్తించలేదని...మరియు సీబీఐ సీనియర్ అధికారుల ఆదేశాల బట్టే కేసును టేకప్ చేశామని అన్నారు జె.డి.లక్ష్మీనారాయణ. ఈ క్రమంలో మీడియా ప్రతినిధి రాజకీయ లోకి  వస్తున్నట్లు వస్తున్న వార్తలపై ప్రశ్నలు వేయగా.. నేను ఎటువంటి రాజకీయ పార్టీలోకి వెళ్లేది లేదని అన్నారు. అంతేకాకుండా కేవలం గ్రామాల్లో సామాజిక సేవపై దృష్టిపెట్టానని పేర్కొన్నారు జేడీ లక్ష్మీనారాయణ.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: