ప్రత్యేకం: అమరావతి నుండే చంద్రబాబుకు శఠగోపం పెట్టేయనున్న జనం

నాయకులు తమపద్దతులు మార్చుకోవాలి. మానాన్న వేసిన రోడ్లపై మీరునడుస్తున్నారు. మేము నిర్మించిన విద్యుత్ వ్యవస్థలోని దీపాలతో ఉచితంగా అనుభవిస్తున్నారు. అంతా తామే తమ స్వంత డబ్బు పెట్టి ప్రజలకు సేవ చేస్తున్నట్లు నాయకులు మాట్లాడటం అసహ్యకరం. ఏభై లక్షలమందికి పెద్ద కుమారుడనై పెన్షన్లు ఇస్తునానని చంద్రబాబు నాయుడు ప్రతివేదికపై మాట్లాడటం అత్యంత విచారకరం. ఈ దేశ రాజకీయనాయకులు ఎవరైనా ఖర్చుపెట్టేది ప్రజలు పన్నుల రూపంలో చెల్లించిన నిధులే. ఆ సొమ్ము ఏమాత్రం చంద్రబాబు, లోకెష్ల స్వంత సంపద నుండి ఇచ్చింది కాదు.  

రెండెకరాల ఆసామి నాలుగుదశాబ్ధాల కాలంలో దేశంలోనే అత్యంత ధనవతుడైన ముఖ్యమంత్రిగా అధికారికంగానే గుర్తించబడిన వ్యక్తి దేశానికి చేసిన సేవ ఏమిటి? దేశమే ఆయనకు సేవ చేసింది. కోటాను కోట్ల రూపాయలు ప్రతి పన్నుకట్టే భారతీయ పౌరుని సొమ్ము.  దాన్ని విలాసాలకు, స్వప్రయోజనాలకోసం ఖర్చు పెడుతూ త్యాగం చేస్తున్నట్లు మాట్లాడే "ఆంధ్రా అబ్బా కొడుకులు"  ను ప్రజలు నిలదీయాల్సిన తరుణం వచ్చింది. మీడియాను చేతులో పెట్టుకొని ప్రవచించే ప్రతిమాటకు నూరు రెట్లు ప్రచారం పొందుతూ ఏమాత్రం కుల మీడియా వందిమాగద గణం బలం తప్ప ప్రజాబలం లేని ఈ కుటుంబ నాయకద్వయం రాష్ట్రంలో చేసే యాగీ అంతా ఇంతాకాదు. 


మనకు ప్రత్యేక హోదాగాని లేదా ప్రత్యేక ప్రతిపత్తి గాని రాకపోవటనికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబే. బిజెపి-టిడిపి సంకీర్ణంలో చంద్రబాబు పట్ల తొలి నుంచీ విశ్వాసం లేని ప్రధాని నరెంద్ర మోడీతో,  నాలుగేళ్ళు సావాసం చేయటం చంద్రబాబు తొలి నేరం. ప్రత్యేక హోదా సంజీవని కాదని తొలినుంచీ వాదించిన చంద్ర బాబును మోసినట్లు ఈ మీడియా మరెవరినైనా మోయగలదా? చంద్రబాబు ఏమంటే దానిని వెలుగెత్తి చాటే ఒకే ఒక కులాధిపత్య మీడియా ప్రజల కళ్ళకు గంతలు కట్టింది. ఏపి ప్రజలకు విభజన ఫలాలు అందకపోవటం, ప్రజా జీవితం దుర్భరం కావటానికి నరెంద్ర మోడీ - చంద్రబాబుల వైరం తోపాటు  అగ్నికి వాయువు తోడైనట్లు ఈ కులాధిపత్య ప్రత్యేక మీడియా కూడా ప్రధానకారణం అని దేశంలోని ప్రతి పసివాడు చెప్ప గలడు.

వినియోగ దృవపత్రాలు (యుటిలైజేషన్ సర్టిఫికేట్లు) నిధులు అందించినవారి తృప్తిమేరకు ఉండాలి. ఇది సహజ న్యాయం. ఎందుకు యూసిలను నిధులందించిన కేంద్ర ప్రభుత్వ తృప్తి మేరకు ఇవ్వలేకపోయారు? ఇది ప్రధాన ప్రశ్న. కనీసం మనం బాంకులో ఒక అవసరం కోసం ఋణం తీసుకున్నా దాన్ని ఎందుకు? ఎలా?  సకాలంలో వినియోగించారా? లేదా? అనే వివరాలతో  యుసిని సమర్పిస్తాం.  నిధుల దుర్వినియోగం జరగబట్టే యుసిలను సకాలంలో సమర్పించ లేకపోవటానికి కారణమన్నది నిర్వివాదాంశం. 

యుటిలైజేషన్ సర్టిఫికేట్స్ సంతృప్తిగా యివ్వట్లేదంటే కెంద్ర నిధులు దుర్వినియోగమో?  నిధుల తరలింపో? జరుగుతున్నట్లే-అక్కడ అనుమానపడక్కర్లేదు. దాన్ని చంద్రబాబు ఒక సారి చెపితే, తెలుగుదేశం బృందం వేనోళ్ళ చెప్పి, కేంద్రాన్ని దూషిస్తే,  వివిధ కులాధిక్య తెలుగు సమాచార స్రవంతి లక్షల సార్లు టివి చానళ్ళలో ఊదర గొడుతూ చంద్రబాబు చుట్టూ రక్షణ వలయం నిర్మిస్తున్నాయి.

ఇక ఒక నొక వైఫల్య తెలుగు సినీ కథానాయకుడు అసలు కేద్రం నిధులివ్వాలే కాని రాష్ట్రం ఎలా ఖర్చు చేసింది అనేది ప్రశ్నించరాదని ప్రవచించారు. అంతేకాదు ఆయన గారు అసలు రాష్ట్ర ప్రభుత్వం యుటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వాల్సిన పనేలేదన్నారు. ఇలాంటి కులగజ్జి గాళ్ళకు, కుల అహంకారం కమ్మిన కళ్ళు,  భైర్లుగమ్మి ఏదో వాగేస్తుంటారు. 

మోడీ ప్రత్యేక హోదా యివ్వకపోయినా అంతకు మించిన ప్రత్యేక పాకేజీ ఇస్తానన్నట్లు అసలు కేంద్రం  ఏపి చేస్తున్న సహాయం ఏ రాష్ట్రానికి చేయలేదని చంద్రబాబు ప్రతిపక్షంలేని శాసనసభలో కూడా తొలి రోజు నుండి నాలుగేళ్ళ కేంద్రంతో స్నేహం నెరిపినంత వరకు వరకూ చెపుతూ,  టివి చానళ్ళలో రణగణ ద్వని పుట్టించి నిజం కాదా?  వారి మైత్రిచెడింది. కూరిమి కల దినములలో బాబు కేంద్రం గురించెప్పిన మంచిని డిలీట్ చేసి, ప్రత్యేక హోదా కోసం మాట్లాడకపోతే రాష్ట్రంలో రాజకీయంగా తనకు, టిడిపికి, తన కుల మీడియాకు, చివరకు తన వందిమాగద బృందం ఉనికికే,  భంగం వాటిల్లే ప్రమాదం గమనించిన బాబు, ఎన్నికల కాలంలో తమ ఉనికికే  ఎసరు వచ్చే వేళ "యూటర్న్"  తీసుకొని ప్రత్యేక హోదా కోసమే తాము బ్రతుకుతున్నట్లు,  తాము వేసే పగటి వేషాలను, ధర్మపోరాటంగా చెపుతూ, తమ ప్రభుత్వానికి తామే ఎదురీదుతూ వాతావరణాన్ని నాటకీయంగా  మార్చేయటానికి పెద్ద ప్రయత్నమేచేస్తున్నారు.  మాటమార్చటం, నాటకాలు వేయటం,  నాలుక మడతేయటం, దాన్ని చంద్రబాబు తరహా చాణక్యమని చెపుతూ,  అదే విధంగా మీడియా కూడా ప్రవర్తించటం నాలుక మడతేయటం జగమెరిగిన సత్యమన్నది నిర్వివాదాంశం. 

చివరకు తప్పుడు పద్దతులతో వ్యవరించే కుల మీడియా-కుల నాయకత్వాలు, కొందరు టిడిపి కులేతర స్వార్ధపరులతో మిళితమై, టివి గొట్టాలముందు, టివి స్టూడియోల లోపల చెసే అల్లరే, యాగీనే వీరి పతనానికి, రాష్ట్రం అవసరాలు తీర్చటంలో,  కేంద్రం మొండి వైఖరి ప్రదర్శించటానికి కారణంగా మారింది. ఇక పోతే విపక్షాన్ని ఆడిపోసు కోవటంలో చంద్రబాబును మించిన నాయకుడు ప్రపంచలో మరొకరు లేరు. ఇక జన్మించరు. 

చాపకింద నీరులా, కులాధిపత్య మీడియాకు సామాజిక మాధ్యమం ఎక్కడబడితే అక్కడ సమాధానం చెపుతూ వస్తూనే ఉంది. రానున్న కాలంలో ఒక ప్రక్క జగన్, మరోప్రక్క పవన్, దూసుకుని వస్తున్నారు. అంటే చంద్రబాబు కుల రాజకీయాల ప్రకారం ఏదోసమయానికి ఎన్నికల ముందువరకు అటు కాపులు, ఇటు రెడ్లు, మరోవైపు దళితులు, మరో దిశలో బ్రహ్మణ సమాజం, ఆపై హైదవ జాతి యావత్తూ చంద్రబాబుకు అమరావతి నుండే శఠగోపం పెట్టటం తథ్యం.   

అమరావతి ఇప్పటికి భ్రమరావతి మాత్రమే. వాన జల్లులకే కారిపోతున్న సింగపూర్ స్టాండర్డ్ భవన సముచ్చయంతో ఆంధ్రప్రదేశ్ కీర్తి విశ్వం నలుదిక్కులకు వ్యాపించిం దన్నది విశ్వ పౌరులందరికి తెలిసిందే ఒక కులగజ్జి సమాజానికి తప్ప. అసలు గత నాలుగేళ్ళ నుండి కేంద్రం వైపు చూస్తూ నిధులు దుబారా చేస్తూ తరలిస్తూ బ్రతికే నాయకత్వం ప్రతిపక్షాన్ని చంపేసి మిత్రపక్షంతో మిత్రులతో కయ్యం పెట్టికింటూ ప్రభుత్వమే పాలనే లేకుండా చేసింది. బిహారు తరహా పాలనను తమ స్వంత పార్టీ వారితో నడిపిస్తున్నట్లు గమనించిన తెలుగుప్రజలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీకి, నాయకత్వానికి అమరావతి నుండే చరమగీతం పాడటానికి నిరీక్షిస్తున్నారు.   

    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: