మండుటెండలు లేక్కచేయక..పాదయాత్రతో రాజన్నబిడ్డ!

Edari Rama Krishna
వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఉత్సాహంగాముందుకు కదులుతోంది. ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి దారి పొడుగునా మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తాగునీటి కష్టాలపై మొరపెట్టుకున్నారు. ప్రతిచోటా రంగుమారిన నీరు వస్తోందని, దీనివల్ల తాము రోగాలబారిన పడుతున్నామని పల్లెవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో జననేత చలించిపోయారు. ప్రజలకు రక్షిత మంచినీరు అందించలేని సర్కారు తీరుపై నిప్పులు చెరిగారు.  జగనన్న అడుగడుగునా పేదల కష్టాలు వింటూ..వారికి ధైర్యం చెబుతూ.. రాజన్న రాజ్యం ఎంతో దూరంలో లేదని భరోసా ఇస్తున్నారు.

సర్కారు తీరును ఎండగడుతూ.. ముందడుగు వేస్తున్నారు.    వైఎస్సార్‌ సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప పాదయాత్రకు ఊళ్లు కదిలివస్తున్నాయి. జగనన్న వెంటే మేమంటూ పల్లె ప్రజలు నినదిస్తున్నారు. రహదారులన్నీ జనంతో కిక్కిరిసిపోతున్నాయి. మహిళలు, యువకులు, రైతులు ఇలా అన్నివర్గాల ప్రజలు జగనన్నను కలిసేందుకు అడుగులు వేస్తున్నారు.  ఆరుగాలం కష్టపడుతున్నా తమకు న్యాయం జరగడం లేదంటూ రైతులు జగనన్నకు మొరపెట్టుకున్నారు. 

మద్దతు ధర ఇవ్వకపోగా, కొన్న ధాన్యానికి రెండు, మూడు నెలలపాటు డబ్బులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.బంగారు తల్లి పథకాన్ని అమలు చేయడం లేదని, గత ప్రభుత్వాలు చట్టం తీసుకువచ్చినా చంద్రబాబునాయుడి ప్రభుత్వం వచ్చిన తర్వాత డబ్బులు లేవన్న పేరుతో  కొత్తగా ఎన్‌రోల్‌మెంట్‌ చేసుకోవడం లేదని పలువురు మహిళలు జననేత వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలు రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం రుణ మాఫీ చేయకపోగా పావలావడ్డీ రుణాలు కూడా ఇవ్వడం లేదని భీమవరం పట్టణానికి చెందిన డ్వాక్రా మహిళలు జగన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సక్రమంగా అమలు కాకపోవడం వల్ల తమ పిల్లలను అప్పు చేసి చదివించాల్సి వస్తోందని వివరించారు. 13 ఏళ్లుగా ఆశా కార్యకర్తలుగా పనిచేస్తున్నా తమకు కనీస వేతనాలు అందడం లేదని వీరవాసరం గ్రామానికి చెందిన ఉన్నమట్ల బేబీ కుమారి జగన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.పేదల కష్టాలు సావధానంగా విన్న జగనన్న వారి కన్నీళ్లు తుడిచి అండగా ఉంటానని, అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: