మగాళ్ళ రక్షణకు ఒక కమీషణ్ అవసరం: ఫైర్ బ్రాండ్ రాజకుమారి

నన్నపనేని రాజకుమారి ఏ డిజిగ్నేషణ్ అక్కరలేకుండా అందరికీ తెలిసిన తెలుగువారి వీరవనిత. మహిళా సమస్యలపై సత్వరమే స్పందించటం ఈమె సహజగుణం. అయితే ఇప్పుడు సంచలనం ఏమంటే ఈ రాకుమారి మగాళ్ళ రక్షణ సమస్య బాధ వీటిపై స్పందించటం. 


పురుషుల బాధలు, రక్షణపై ఇన్నాళ్లకైనా ఒక డిమాండ్ వచ్చింది. మహిళల సమ్రక్షణ రక్షణ కోసం మహిళా కమిషన్ ఉన్నట్లే, పురుషుల రక్షణకూ ఒక కమిషన్ ఉండాల నేది ఈ డిమాండ్. ఇది కూడా ఒక మహిళ గొంతు నుంచి రావటం సంచలనం అయ్యింది. ఇటీవల కాలంలో భార్యల చేతిలో చనిపోతున్న, చిత్రహింసలకు గురవుతున్న మగాళ్ల సంఖ్య కూడా పెరిగుతూ వస్తుంది. అందుకే పురుషుల రక్షణకు ఒక కమిషన్ ఉండాలనేది డిమాండ్ ఈ ప్ర‌ముఖ మహిళామణి సారాంశం. 

ఇలా తెర‌మీద‌కు వ‌చ్చిన చాలాకాలం నుండి మగాళ్ళ గళంలోనే మరుగునపడ్డ సమస్యను తన సంచలన వ్యాఖ్య‌ల ద్వారా బయటకు తెచ్చింది మరెవరోకాదు ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి. 

ఉత్తరాంధ్ర లో ఒక నెల రోజుల సమయలోనే రెండు ఘోరాతి ఘోరాలు జరిగాయి. పెళ్లయిన వారం రోజుల్లోనే తన భర్తను సుపారీ ఇచ్చి ఒక భార్య చంపించింది. మరో కేసులో పెళ్లయిన 20 రోజుల్లోనే, బైక్ పై భర్తతో వెళుతూనే భర్తను వెనక నుంచి కౄరంగా కత్తితో పొడిచి అక్కడి నుంచి అతని భార్య పరారీ అయింది. అదే విధంగా వివాహే తర సంబంధాలతో భర్తలపై హత్యాయత్నాలు నిరంతరంగా పెరిగిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో న‌న్న‌ప‌నేని రాజకుమారి స్పందిస్తూ  శ్రీకాకుళంలో భార్య చేతిలో దాడికి గురైన వ్యక్తికి అండగా ఉంటామన్నారు. 

మహిళల్లో ఇలాంటి విపరీతమైన నేరప్రవృత్తి పెరగటానికి టీవీల్లో వచ్చే సీరియల్స్ కారణం అని ఆమె బల్లగుద్ది చెప్పారు. టెలివిజన్ సీరియల్స్ కు కూడా సెన్సార్ ఉండా లని,నేర ఇతివృత్తం, కుట్ర, కుతంత్రాలు ఉండే దృశ్యాలను ఈ సీరియల్స్ నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. మహిళల్లో ఇలాంటి విపరీత ధోరణిలకు కారణాలను గుర్తించి, వెంటనే సరిదిద్ద వలసిన అవసరం ఉందన్నారు.


అంతే కాకుండా, భార్యలలో చేతుల్లో మోసపోతున్న, చిత్రహింసలకు గురవుతున్న పురుషులకు కుడా సమయలు పరిష్కరించటానికి ఒక పురుష కమిషన్ కూడా ఉండాల న్నారు. మహిళా కమిషన్ ఉన్నట్లే, పురుషులకు ఒక కమిషన్ ఎందుకు ఉండ కూడదు? అని నన్నపనేని రాజకుమారి ప్రశ్నించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: