వారసత్వ రాజకీయాలకు తెరలేపనున్న 2019ఎన్నికలు - డైనాస్టీ వర్సెస్ డెమోక్రసీ

ఈ మద్య సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్న ఒక విషయం ఆధారంగా ఈ వ్యాసం రాయటం జరుగుతుంది.

మనదేశాన్ని కాంగ్రెస్, బిజెపి లాంటి దేశవ్యాప్తంగా అధికారంలో విలసిల్లుతున్న పార్టీలే కాకుండా “ప్రాంతీయ పార్టీలు” “కిచిడీ అలయెన్సులు”గా ఏర్పడి అంటే కాంగ్రెస్ నాయకత్వంలోని “యుపిఏ”  ప్రభుత్వాలు, ఆ తరవాత భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని  “ఎన్ డిఏ”  ప్రభుత్వాలు ఈ దేశాన్ని పాలించాయి. ఐతే ఎక్కువకాలం గాంధి-నెహృ కుటుంబమే ఈ దేశ రాజకీయాధికారాన్ని శాసించింది. 


అయితే ఈ మద్య తెలంగాణా ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖరరావు ఒక కొంగ్రొత్త ప్రతిపాదన తెచ్చారు. అదే కాంగ్రెసేతర, బాజపాయేతర పార్టీలతో కూడిన “ఫెడరల్ ఫ్రంట్ “ ఏర్పాటు చెయ్యాలని, అప్పుడే దేశంలో "ఫెడరల్ రాజ్యాంగ విధానం - గుణాత్మక పాలన - ఒక నిర్వచనంలేని బ్రహ్మ పదార్ధం అమలు చేయవచ్చని లేకపోతే కేంద్రంలోని ప్రభుత్వ అత్త-పెత్తనం రాష్ట్ర ప్రభుత్వాలకు తప్పదని ప్రవచించారు. ఇక్కడ రాష్ట్రాల్లో ఒకే కుల కుటుంబ వారసుల దాష్టీక పెత్తనం ప్రజలు భరిస్తారని శ్రీవారి ఆంతర్యం.


బాగుందయ్యా చంద్రం!  రేపు కిచిడీ ప్రాంతీయ పార్టీలు కుక్కల్లా అధికారం కోసం కొట్టుకోరని గ్యారంటీ ఏమైనా ఉందా! ఉదాహరణకు ప్రక్కన కర్ణాటకలో ఏర్పడ్డ ‘కాంగ్రెస్-జెడిఎస్’ సంకీర్ణంలో ఉన్న రెండు పార్టీలే పదవుల కోసం ప్రాంతీయ పార్టీల కాట్లాట మొదలెట్టి వారమైనా ఇంకా మంత్రిమడలినే కూర్పు చేయలేక పోయారు, అత్యాశా పరుడైన జెడిఎస్ కుమారస్వామి.  ఈ కిచిడీలు ఎలా వైఫల్యం చెందుతాయో సోదాహరణంగా చూపిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.  రేపు మూడవ ఫ్రంట్ లేదా ఫెడరల్ ఫ్రంట్ ఏదైనా కానివ్వండి ఉదాహరణకు చూద్ధాం! మన దరిద్రం ఎలా ఉండబోతోందో? 


1. మహారాష్ట్ర లాంటి ప్రముఖ వాణిజ్యరాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన శివసేనకు దాని వ్యవస్థాపక అధ్యక్షుడు బాలా సాహెబ్ థాకరే కుమారుడు ‘ఉద్ధవ్ థాకరే’ వారసుడు గా రాజకీయ ఆధిపత్యం వహిస్తున్నారు. ఇంకా ఆ యింట వారసుల చైను ఉంది కూడా! 


2. అలాగే అక్కడే ప్రముఖ రాజకీయ నాయకుడు శరద్ పవార్ స్థాపించిన ఎన్సిపికి ఆయన కూతురు ‘సుప్రియా సూలే’ వారసురాలుగా ఇప్పటికే ఎంపిగా ఉన్నారు. ఇంకా ఆయన తమ్ముని కుమారుడు రోహిత్ పవార్ కూడా పోటీపడుతు ప్రచారంలో ఉన్నారు. 


3.ఇకపోతే బిహార్లో రాష్ట్రీయ జనతా దళ్ (అర్జెడి)నాయకుడు లాలు ప్రసాద్ యాదవ్ కుమారులు తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్ వారసులుగా రాజకీయ రంగంలో బాగా కుదురుకొనే ఉన్నారు. అంతేకాదు కాదూ కూడదంతే ఆయన సంతానమే ఒక చాంతాడంత ఉంది. ఆయన భార్య రబ్రి కూడా అక్షరం ముక్క రాకపోయినా ముఖ్యమంత్రి పాత్ర అవలీలగా రఫ్ ఆడించి విజయవంతంగా నిర్వహించారు. అందుకే ఆ రాష్ట్రం అలా తగలడింది. ఇంకా ప్రతిపక్షాలు వారివారసులకు కొదవేలేదు.


4. ఇక ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ పార్టీ నాయకుడు మూలాయం సింగ్ యాదవ్ కుమారుడు ఇప్పటికే ఊత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనుభవం సంపాదించిన అఖిలేష్ యాదవ్ వారసునిగా రాజకీయరంగాన్ని ఒక ఊపు ఉపేశారు  ఇంకా మరోసారి ఊపెసేలాగా ఉన్నారు. ఆ యింటి నుండి ముప్పైమంది వరకు రాజకీయాల్లో వెలుగులు చిందిస్తూనే ఉన్నారు.


5. ఇక ఆంధ్రప్రదేశ్ లో – దేశం లోనే నాలుగు దశాబ్ధాల అత్యంత సుధీర్ఘ రాజకీయ అనుభవముండి, అటు ప్రపంచ ప్రఖ్యాత హైదరాబాడ్ నగరాన్ని, ఇటు విశ్వ విఖ్యాత అమరావతీ నగరాన్ని, నిర్మించిన ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి కుమారుడు,  లోకెష్ నాయుడు ఐటి శాఖా మంత్రిగా వారసుడుగా ఆ ముఖ్యమంత్రి పీఠం పక్కనే నిలబడి ఉన్నారు. ఇంకా ఇరవై ఐదేళ్ళ వరకు ఆయన కుమారుడు దేవాన్ష్ అర్హత సంపాదించేంతవరకు ప్రస్తుతం మంత్రిగా, ఆపై ముఖ్య మంత్రిగా  వెలుగుతారు.


ఈ లోగా  చంద్రబాబు భారత ప్రదాని అవుతారు. దేవన్ష్ ముఖ్యమంత్రి కావటానికి సిద్ధం అవగానే లోకేష్ ప్రధాని ఐపోతారు. అప్పటికి చంద్రబాబు ఇల నున్న అమరావతి వదిలేసి పైనున్న అమరావతిలోని దేవెంద్రుని పీఠంపైకి జంపై పోతారు. మూటాముల్లె సర్దుకొని ఆయన జేసీ దివాకరరెడ్ది అమరలోకంలో వారి పాదసేవలో తరించటానికి వేంచేస్తారు. 


6. కర్ణాటకలో ఇప్పుడు జనతా దళ్ (సెక్యులర్)  - (మన దురదృష్టమేమంటే సెక్యులర్ అంటే అర్ధం ఒక్కళిగ కులాధిపత్యం అనుకోవాలి అంతే కాని మన రాజ్యాంగం నిర్వచించిన లౌకికం కాదు) అధినేత హెచ్ డి దెవెగౌడ కుమారుడు కుమారస్వామి తాజాగా ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ మద్దతుతో ప్రమాణ స్వీకారం చేసిన వారసుడు.


ఒక సారి దేశ ప్రధాని పదవి నలంకరించి సాక్షాత్తూ పార్లమెంట్లో నిద్దురపోయిన ఈ ఘనుడు మరోసారి ప్రధానిగా మంత్రి చాన్స్ వస్తుందేమోనని గోతి కాడ నక్కలాగా కాచుకొని ఎదుర్చూస్తున్నారు. ఇంకా ఈ యింట కోడళ్ళ నుండి మనుమలు మనుమరాళ్ళు కూడా ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటానికి రడీ. ప్రజలు ఎన్నుకోకపోయినా వారు సిగ్గుపడరు బాధపడరు. పదవి ఉంటే చాలు ఏదైనా వదిలేస్తారట, 


7. అగ్నికణం పశ్చిమ బంగ ముఖ్యమంత్రిణి - త్రిణమూల్ పార్టీ అధినేత్రి - మమత బెనర్జి వారసుడుగా, ఆమె నెవ్యూ అభిషెక్ బెనర్జి ఇప్పటికే ఎంపిగా  రాజకీయరంగంలో ఉన్నారు. (ఇంకా కొందరు ఉన్నట్లుంది రిసెర్చ్ చేసి మళ్ళా మరో వ్యాసంలో రాస్తాను) 


8. తమిళనాట మాజీ ముఖ్యమంత్రి డిఎంకె అధినేత కరుణానిధి వారసులుగా వారి పుత్రరత్నం స్టాలిన్,  కుమార్తె  కనిమోళి సిద్ధంగా ఉన్న రాజకీయ పాతకాపులే. ఇంకా వారసులు కావాలంటే కలియుగాంతం వరకు సరిపడేంత మంది వారసులు ఈ ఇంట ఉన్నారు. ఇక్కడ పెళ్ళాలు పిల్లలూ ఎక్కువే. 


9. కొత్త రాష్ట్రం తెలంగాణా ముఖ్యమంత్రి, తెలంగాణా  రాష్ట్ర సమితి (టిఆరెస్) అధినేత, కలవకుంట్ల చంద్రశేఖర రావు, ముందు ముందు ఇబ్బందులు రాకుండా రైలు బండి బోగీల్లాగా వరసలెంబడి వారసులను ఇప్పటికే పదవుల్లోకి కుదురుకునేలా చేసి తాను ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి గుణాత్మక పాలన మనకు అందించ  టానికి  ప్రధాని కావాలని తహతహ లాడుతున్నారు పాపం ఈ త్యాగ మూర్తి 


అప్పటికి ముందే ప్రస్తుతం ఐటి, పురపాలక శాఖలు నిర్వహిస్తున్న కెటిఆర్ ముఖ్యమంత్రిగా సింహాసనం ఎక్కటానికి రడీ. అంతేకాదు ఆ పదవి కోసమే ఆయన కూతురు కవిత కూడా డేగలాగా కాసుకునే ఉంది. అంతేకాదు ఆమెకు అనువంశ పాలన చక్రవర్తుల రాజ్యపాలన అంటే మక్కువ ఎక్కువ ఆ విషయం ఆమె నిస్సిగ్గుగా పార్లమెంట్ లోనే బయటెట్టేశారు. ఒక వేళ  వీళ్ళకేమైనా ఐతే సిద్ధంగా ఇంకొంచెం దూరంలో అవకాశం కోసం ఎదురు చూస్తూ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కెసిఆర్ మేనల్లుడు హరీష్ రావు స్టెప్నీగా సిద్ధం. 


10. ఇక భారత జాతీయ కాంగ్రెస్ అధినేతగా భావి భారత ప్రధాని పదవి కోసం రాహుల్ గాంధి “గాంధి-నెహృ వంశ వారసుడు” ఇష్టం లేకపోయినా రాజకీయరంగ ప్రవేశం చేసేశారు. నరెంద్ర మోడీ లాగా బ్రహ్మచారిగా బ్రతకటానికి సిద్ధపడ్డారు కూడా!  ఇంకా వారసులు కావాలంటే అవసరమైతే ప్రియాంకా గాంధి నెహృ వాధ్రా ఉండనే ఉన్నారు.


ఈ వంశం గత తొమ్మిది దశాబ్ధాలుగా ఆ పార్టీకి ఏదో రకంగా నాయకత్వం వహిస్తూనే వస్తుంది. ఆరు నుండి ఏడు దాశాబ్ధాలుగా దేశ ప్రధానులుగా అధికార పార్టీ అధ్యక్షులు గా పాలన వారి చేజారనివ్వట్లేదు.


ఆఖరికి ఆయింటి కోడలు విదేశీ వనితైనా భారత అధినేత్రి అయితీరతారు. ఏ విదేశీయులైనా భారత ప్రధాని కావాలనుకుంటే ఈజీ-వే, ఆ యింటి పురుషుణ్ణి ప్రేమించి పెళ్ళి చేసుకుంటే, ఈ దేశ ప్రధానిగా కాని రాష్ట్రపతిగా కాని పదవిలోకి షార్ట్ కట్ లో రావచ్చు. ఇది సంపూర్ణ రాజవంశ పాలనే.


ఇక మిగిలినది భారతీయ జనతా పార్టీ – దీని వారసుల పేరేమైనా చెప్పగలరా?  దేశ ప్రధానిగా! అంటే నరెంద్ర మోడీకి వారసులు లేరు కదా! ఉన్నా బిజెపి సిద్ధాంతాల ప్రకారం అది చెల్లదు. అంటే “డైనాస్టీ రూల్” (రాజవంశ పాలన) ఇక్కడ మృగ్యం అంటే పూర్తిగా కుదరదు.


ఇప్పుడు చెప్పండి ఈ సర్వ సత్తాక ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యం లో ప్రజాస్వామ్యముందా?  కనీసం నేతి బీరకాయలో నేయి ఎంత ఉంటుందో అంతైనా ప్రజాస్వామ్యం మనకు ఉందా?


ఇప్పుడు మనకు ఏ పాలన అవసరమో? మనమే నిర్ణయించుకోవాలి. ఫెడరల్ వ్యవస్థతో కూడిన ప్రజాపాలన ఈ వారసుల ఆధిపత్య ప్రాంతీయ పార్టీల సంకీర్ణాల తో సాధ్యమా? ఉదాహరణకు ముఖ్యమంత్రిగా వారం క్రితమే ప్రమాణ స్వీకారం చేసి మంత్రివర్గం నిర్మించలేని దుస్థితి మన కళ్ళకు కనిపిస్తూనే ఉంది. 




అయితే కాంగ్రెస్, బిజెపియేతర ప్రభుత్వం ఈదేశంలో ఏర్పడితే ఆనాయకుల వారసులే నాయకత్వాలు వహిస్తారని చెప్పటానికి సంకోచం అక్కర్లేదు. అంటే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పడితే దేశంలో అనువంశిక రాజ్యపాలన తప్పదు. దీన్నే  డైనాస్టీ పోలిటిక్స్ - రాజవంశ తరహా రాజ్యపాలన అన్నమాట - అందుకే కుమారస్వామిని కాంగ్రెస్ "కింగ్"ను చేసింది.  అని చెప్పొచ్చు. అంతే వారసులే పాలకులుగా ఎంపికయ్యే చక్రవర్తుల తరహా రాజవంశ పాలనే మనకు పునరావృతమవటం తథ్యం.


అందుకే మనకు తాజా పరిస్థితుల్లో భారతీయ జనతా పాలనే మంచిది. ఇక్కడ డైనాస్టీ పాలన ఉండదు. కాకపోతే కొంత నియంతృత్వం ఉండవచ్చు. అలాంటి పరిస్థితి నుండి రక్షించటానికి మొన్న కర్ణాటకను కాపాడిన “న్యాయస్థానాలు” వాటి “తీర్పులు” ఉండనే ఉన్నాయి.


అసలు ఈ దరిద్రానికి కారణం మన భారత ప్రజల రక్తంలో సారీ! జీన్స్ లో ఇంకి ఉన్న బానిస లక్షణాలే. ఎవరినని ఏం లాభం.


చివరికి  కేంద్రంలో ఒక పప్పు – మన రాష్ట్రం లో మరోపప్పు ను అధికారం లోకి తెచ్చుకోవటమేమిటి. మనమంతా దగుల్బాజీ గాళ్లం కాబట్టి ఇలా జరుగుతుంది. సెలవు  ప్రకటించి ఓట్లెసి రండిరా!  అన్నా ఓటు వేయకుండా! పెళ్ళాం తోనో ఇంకెవరితోనో సినిమాకు చెక్కేసే,  కుహనా విద్యావంతులున్న ఈ దేశానికి కొంతైనా నియంతృత్వ ప్రజాస్వామ్యం (ఓట్లు సగం మందే వేస్తాం కాబట్టి సగం నియంతృత్వం సగం ప్రజాస్వామ్యం) అవసరం కూడా!


క్రింద పిక్చర్లో నిజమెంతో తెలియదు గాని అంతర్జాలంలో విరివిగా కనిపించే చిత్రం నెహౄ కుటుంబ చరిత్ర 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: