అధికార పార్టీ ఎమెల్యే బోండాగిరితో అమరావతిలో నీరుగారిపోతున్న ప్రజాస్వామ్యం

అమరావతిలో ప్రజాస్వామ్యం పూర్తిగా మంటగలసింది. దీనికి అనేక ఉదాహరణలు అందులో తాజా వార్త సుబ్బరాయనగర్ వెంచర్ లో స్థలం ఇప్పిస్తామని నందిగామకు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వద్ద ₹35 లక్షలు తీసుకొని రిజిస్ట్రేషణ్ సమయంలో తనతో మాట్లాడిన తరవాతే రిజిస్ట్రేషణ్ చేయించుకోమని చెప్పారని ఆరోపించారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ కు ప్రయత్నిస్తే బోండా ఉమ అనుచరులైన మాగంటి బాబు, వాసు, వర్మ, అనే వాళ్లు భూమీ లేదు, డబ్బు వాపసూ లేదని ధౌర్జన్యానికి దిగుతున్నారని భాదితులు ఆరోపిస్తున్నారు. ఈ విధంగా బోండా ఉమ మరో పాపపు నిర్వాకానికి తెరలేపారు.  
 

అమరావతి నగరానికి ప్రాథమిక ఆధారం విజయవాడ. అక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గపు అధికార పార్టీ తెలుగుదేశం శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వర రావు  ఆయన అనుచరుల ఆగడాలు ఆకాశాన్ని అంటుతున్నాయని అటున్నారు. అరాచకాలకు అంతే లేకుండా పోతూంది. రాష్ట్ర రాజధాని పరిపాలనా కేంద్రం కొలువు తీరిన చోట సాక్షాత్తు దేశం లోనే నాలుగు దశాబ్ధాల అత్యంత సుధీర్ఘ రాజకీయ అనుభవమున్న ముఖ్యమంత్రి నివాసమైన ఆ నగరంలోనే అధికార పార్టీ ఎమ్మెల్యే సామాన్యు ల భూములనే కాదు, దేశం గౌరవంగా స్వాతంత్ర సమరయోధులకు సగౌరవంగా ఇచ్చిన భూములను కబళిస్తున్నారు. 

స్వాతంత్ర సమర యోధుడు సూర్యనారాయణకు చెందిన 50కోట్ల విలువైన భూమిని తప్పుడు పత్రాలు సృష్టించి తన భార్య సుజాత పేరు మీద మార్చేసుకున్న బోండా ఉమా ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈ భూవివాధం, భూమి కబ్జాపై విచారణ జరుగుతున్న సమయంలో బోండా గాంగ్ చేసిన మరో భూకబ్జా దురాక్రమణ వెలుగులోకి వచ్చింది.

పెనమలూరులో ఇద్దరు మహిళలు ఉమాదేవి, లక్ష్మీలకు చెందిన భూమిని బోండాగాంగ్ కాజేసింది. 80సెంట్ల భూమిని డెవలప్‌మెంట్‌ పేరుతో తీసుకుని వారికి టోపిపెట్టారు. భూ యజమాను లకు తెలియ కుండా తప్పుడు పత్రాలు సృష్టించి ఏకంగా బ్యాంకులో నాలుగు కోట్ల రూపాయల ఋణం కూడా తీసుకొచ్చారు. మూడేళ్లలో నిర్మాణాలు చేసి ఇవ్వాల్సిందిగా డెవలప్‌మెంట్‌ ఒప్పందంలో ఉంది. అలా చేయని పక్షంలో భూమిని తిరిగి అప్పగించాలని ఒప్పందంలో ఉంది.

అయితే మూడేళ్లు అవుతున్నా బోండా ఉమామహేశ్వరరావు ఆయన అనుచరులు వెంకటనర్సయ్య, కిషన్ ఎలాంటి నిర్మాణాలు చేయలేదు. ఈ నేపథ్యంలో తమ భూమిని తమకు తిరిగి ఇవ్వాల్సిందిగా ఉమాదేవి, లక్ష్మీ కోరగా, బోండా అనుచరులు బెదిరింపులకు దిగుతున్నారని బాధితులు చెబుతున్నారు. తమకు చెప్పకుండా నాలుగు కోట్లురూపాయలు ఋణం  తెచ్చుకున్నారని, ఇప్పుడు దాన్ని బ్యాంకుకు కట్టి భూమిని తీసుకోండి అంటూ బెదిరిస్తున్నారని ఆవేదన చెందారు. 


బోండాగాంగ్ భూకబ్జాపై విచారణ జరుపుతున్న జాయింట్‌ కలెక్టర్‌ను, ఉమా దేవి  లక్ష్మీలు కలిసి ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు మాత్రం తమకు సంబంధం లేదని, న్యాయస్థానం లో తేల్చుకోండని సలహా ఇచ్చారని ఉమాదేవి, లక్ష్మీ వాపోయారు. విజయవాడ చంద్రబాబు కలల విశ్వనగరం అమరావతి ఏనాటికీ "సామ్యానులు" నివసించ టానికి ఆవాస యోగ్యమైన నగరం కాదని, అధికారం చేతు లో ఉన్నవారు, భూమాయగాళ్ళు, కల్తీ, ఇసుక, విద్య, ఆరోగ్య, సెక్స్ రాకెట్ మాఫియా గాళ్ళు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవటానికి అరాచక వాదుల అడ్డాగా అమరావతి నేలకొంటుందని దాని భవిష్యత్ చెపుతుంది. దీనికి ఒక ఉదాహరణే బొనడాగాంగ్ అరాచకాలు. మామూలు ప్రజలు బతి కే పరిస్థితి ఇక్క ఉండదని నగర ప్రజలు వాపోతున్నారు. 


ఇలా రాజధానిని నేఱగాళ్ళకు వదిలేసి ముఖ్యమంత్రి, ధర్మపోరాటం, నవనిర్మాణ పోరాటం అంటూ అధికార పార్టీ ప్రభుత్వ అధినేత అయి ఉండి ఆయన చేసే పోరాటం ఎవరిపైన అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కనీసం తన పార్టీ ఎమెల్యేని గత నాలుగేళ్ళుగా అత్యంత ప్రమాధకర ఆరోపణలున్న నియంత్రించలేని ఈయన విశ్వనగరాన్ని నిర్మించగలరన్న నమ్మకం తమకు లేదంటున్నారు అమరావతి వాసులు. ఎన్నికల నాటికి బోండా, బుద్ధా. కేసినేని, చింతమనేని ఇలా ఎమెల్యెలే తెలుగుదేశాన్ని భ్రస్టు పట్టిస్తారని, తాము ఈ పార్టీ పాలనను వదిలించు కోవాలని ఎన్నికలకోసం నిరీక్షిస్తున్నామని అంటున్నారు.     


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: