ఈ నవ నిర్మాణ దీక్ష వల్ల ఒరిగేదేంటి... డబ్బులు వృధా తప్పితే...!

Prathap Kaluva

చంద్ర బాబు నాయుడు కోట్లు కోట్లు తగలేసి నవ నిర్మాణ దీక్ష చేపడుతున్నాడు. అస్సలు ఆ దీక్షల వలన లాభమేంటో నిజంగా బాబు కూడా తెలియదేమో... అంటే అది తన పార్టీ భవిష్యత్ కోసం చేస్తున్నాడన్న సంగతి బాబు కు తెలుసు. ఈ దీక్ష ను రాజకీయంగా వాడుకోవాలని తహ తహ లాడుతున్నాడు. అయితే ఇందులో ఇన్ని కోట్లు ప్రజా ధనం తగలేసి మరీ చేస్తున్నాడు. 


ఈ కార్యక్రమంలో చేసే పనేమిటి? కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధాని మోదీని, రాష్ట్ర బీజేపీని, ప్రధాన ప్రతిపక్ష నేత జగన్‌ను, కొత్త శత్రువైన జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను వారంపాటు అదేపనిగా ఘాటుగా, మోటుగా విమర్శించడం. ఏపీకి అన్యాయంపై చెప్పిన 'కతలు' చెప్పడం. ఈ కార్యక్రమాన్ని పార్టీపరంగా, పార్టీ ఖర్చుతో చేసుకుంటే అభ్యంతరం లేదు. కాని అధికారికంగా నిర్వహిస్తూ, కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేస్తున్నారు. ప్రత్యర్థులను తిట్టడానికి ప్రజల డబ్బు ఖర్చు చేయడం ధర్మపోరాటం చేసే బాబుకు ధర్మమా?


నవనిర్మాణ దీక్ష కారణంగా పరిపాలన కుంటుపడుతోంది. కారణం...అధికారులంతా ఈ కార్యక్రమంలో తలమునకలుగా ఉండటమే. సభలు, సమావేశాలు వగైరాలవల్ల ట్రాఫిక్‌ సమస్యలు తద్వారా ప్రజలకు ఇబ్బందులు. దీక్ష నిర్వహణకు జిల్లాకు కోటి రూపాయల చొప్పున ఇచ్చామని, అవసరమైతే మరో 50 లక్షల చొప్పన ఇస్తామని చంద్రబాబు చెప్పారు. ఇంకా ఎక్కువే ఖర్చవుతుండొచ్చు. కాని బాగుండదని తక్కువ చేశారేమో...! 17వేల మంది నోడల్‌ అధికారులను నియమించారు. వారు ప్రతిరోజు దీక్ష జరిగిన తీరుపై నివేదికలు ఇవ్వాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: