దేశం అవాక్కు అయ్యే స్కాం లో ఇరుక్కున్న బాబు

KSK
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతుంది. ఇప్పటికే అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్న అన్నా తంటాలు పడుతున్న చంద్రబాబుకి  గతంలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన సంగతి మనకందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు ఎయిర్‌ ఏషియా లైసెన్స్‌ల కుంభకోణంలో మరోసారి అడ్డంగా బుక్ అయ్యారు.

విశేషమేమిటంటే ఇది కూడా ఒక ఆడియో టేపులో అడ్డంగా దొరకడం...కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా టీడీపీ ఎంపీ అశోక్‌గజపతిరాజు ఉన్నప్పుడు ఎయిర్‌ ఏషియాకు అంతర్జాతీయ విమాన కార్యకలాపాలకు సంబంధించిన లైసెన్స్‌ల వ్యవహారానికి సంబంధించిన ఆడియో టేపు ఒక్కసారిగా బయటకు వచ్చింది. దీంతో ఈ విషయంపై జాతీయస్థాయిలో చర్చలు రచ్చరచ్చగా జరుగుతుంది. ఇంటర్నేషనల్‌ ఆపరేషన్‌ లైసెన్స్‌ల కోసం భారత ఎయిర్‌ ఏషియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టోని ఫెర్నాండజ్, సంస్థ ఇండియా సీఈవో మిట్టు శాండిల్య మధ్య 33 నిమిషాల పాటు సాగిన ఈ ఆడియో సంభాషణలో పలు సంచలన విషయాలు ఉన్నాయి.

అంతేకాకుండా ఇప్పటికే ఈ కేసు విషయమై కేంద్ర నిఘా సంస్థ సీబీఐ ఫెర్నాండజ్‌పై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసింది. తాజాగా బయటపడిన ఈ  కుంభకోణం ఆడియో టేపులో చంద్రబాబు అశోక్గజపతిరాజు పేర్లు బయటకు వచ్చాయి.

ఇదే విషయాన్ని ఒక ఆంగ్ల పత్రిక ప్రచురించింది...చంద్రబాబుతో వ్యవహారాన్ని నైస్‌గా ప్లే చేస్తే మనం అన్నీ సాధించుకోవచ్చు అంటూ మిట్టు… ఫెర్నాడేజ్‌తో చెప్పడం ఆడియో టేపులో ఉంది. ఈ నేపద్యంలో ఇప్పటికే ఈ కేసు విషయమై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ త్వరలో అశోక్గజపతిరాజు ను చంద్రబాబును విచారించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: